AI – Word Of The Year : 2023 సంవత్సరానికిగానూ కాలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)’’ నిలిచింది. ఈవిషయాన్ని కాలిన్స్ డిక్షనరీ సంస్థ వెల్లడించింది. ఏఐ అనే పదం యొక్క ఉపయోగం వేగవంతమైంది, దాని ప్రాధాన్యత పెరిగిందని కాలిన్స్ డిక్షనరీ సంస్థకు చెందిన లెక్సికోగ్రాఫర్‌లు తెలిపారు. అందుకే ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)’’ను ఎంపిక చేశామని వెల్లడించారు. ఈమెయిల్, వీడియో స్ట్రీమింగ్ తరహాలో ఏఐ అనే పదం కూడా బాగా జనంలోకి వెళ్లిపోయిందన్నారు. తమ సర్వేలో ఇదే విషయం తెలిసిందని కాలిన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలెక్స్ బీక్రాఫ్ట్ చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్‌లు, వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, పుస్తకాలలో పబ్లిష్ అయిన కీలక పదాలను.. రేడియోలు, టీవీల ప్రోగ్రాంలలో వాడిన దాదాపు 2వేల కోట్ల పదాలను విశ్లేషించామన్నారు. వాటన్నింటిలోనూ జనానికి వేగవంతంగా చేరువైన పదంగా ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)’’ నిలిచిందని తెలిపారు. 2022లో కాలిన్స్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘పర్మాక్రైసిస్’ నిలిచింది. అభద్రత, అస్థిరతలు సుదీర్ఘకాలం కొనసాగితే దాన్ని ‘పర్మాక్రైసిస్’ అని పిలుస్తారు. 2020లో ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘లాక్‌డౌన్’, 2016లో ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘బ్రెక్సిట్’ నిలిచాయి.
We’re now on WhatsApp. Click to Join.
- నెపో బేబీ (nepo baby) అనే మరో పదం ఈ ఏడాది బాగా ప్రాచుర్యం పొందిందని కాలిన్స్ డిక్షనరీ సంస్థ తెలిపింది. తల్లిదండ్రుల మాదిరిగానే పారిశ్రామిక రంగంలో విజయం సాధించిన ప్రముఖుల పిల్లలను ప్రస్తావించడానికి ‘నెపో బేబీ’ అనే పదాన్ని వాడుతున్నారని పేర్కొంది.
- నిర్వహణ వ్యయాలు బాగా పెరిగినా లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలను సూచించడానికి ‘‘గ్రీడ్‌ఫ్లేషన్’’(Greedflation) అనే పదం ఈ ఏడాది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలిపింది.
- లండన్‌లో అత్యంత కాలుష్య కారక కార్ల డ్రైవర్‌లకు జరిమానా విధించే అల్ట్రా లో ఎమిషన్ జోన్‌ను సూచిస్తూ ‘‘Ulez’’ అనే పదాన్ని వాడుతున్నారు. ఇది కూడా ఈ ఏడాది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని పేర్కొంది.
- కొన్ని వాణిజ్య ఉత్పత్తులను వాడొద్దను సోషల్ మీడియా ఫాలోయర్లకు కొంతమంది సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు సూచించడాన్ని ‘‘డీ ఇన్‌ఫ్లూయెన్సింగ్’’ అని పిలుస్తున్నారు. ఇది కూడా ఈ ఏడాది బాగా వాడకంలోకి వచ్చింది.
- ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌లో ‘‘బాజ్‌బాల్’’ అనే పదం ఈ ఏడాది బాగా వాడుకలోకి వచ్చింది. న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్‌ను ఈ పదం సూచిస్తుంది. క్రికెట్ మ్యాచ్ కోసం అతడు చేసే వ్యూహ రచనను ‘బాజ్’ అని(AI – Word Of The Year) పిలుస్తారు.