Site icon HashtagU Telugu

Aeroplane Video: హైవేలో అండర్ బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. వీడియో వైరల్!

Viral

Viral

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఓ ట్రక్కులో తరలిస్తున్న విమానం హైవే అండర్‌పాస్‌ కింద ఇరుక్కుపోయింది. ఈ ఘటనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీలోని బాపట్ల జిల్లాలో కొరిసపాడు అండర్‌పాస్‌ కింద విమానం ఇరుక్కుపోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

హైదరాబాద్‌కు చెందిన పిస్తా హౌస్ యజమాని కొనుగోలు చేసిన పాత విమానం అండర్‌పాస్‌ కింద ఇరుక్కుపోవడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు ఓ ట్రక్కు విమానాన్ని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అండర్‌పాస్‌ కింద విమానం ఇరుక్కుపోయిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని విమానాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పిస్తా హౌస్ ఈ విమానాన్ని రెస్టారెంట్ గా మార్చేందుకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.