“గోధుమలందు ఈ గోధుమ వేరయా” అంటున్నారు పోషకాహార నిపుణులు !! లుక్ లో.. రేట్ లో .. టేస్ట్ లో.. న్యూట్రిషన్ లో .. ఏ విషయంలో చూసినా బ్లాక్ గోధుమ (Black Wheat Benefits) స్పెషలే !! సాధారణ గోధుమలతో పోలిస్తే .. నల్ల గోధుమల రేటు రెట్టింపు ఉంటుంది. నల్ల గోధుమలకు(Black Wheat Benefits) నల్ల రంగు రావడానికి కారణం .. వాటిలోని ఆంథోసైనిన్ ( Anthocyanin) అనే పిగ్మెంట్. నార్మల్ గోధుమలలో ఆంథోసైనిన్ 5 నుంచి 15 ppm ఉంటే… నల్ల గోధుమలలో ఇది 40 నుంచి 140 ppm దాకా ఉంటుంది. అందుకే వాటికి బ్లాక్ కలర్ వస్తుంది. నల్ల గోధుమలలో ఆంత్రోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఒత్తిడి, మోకాళ్ల నొప్పులు, రక్తహీనత, అధిక రక్తపోటు, జలుబు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులను నయం చేయడంలో హెల్ప్ చేస్తుందని అంటారు.
also read : Wheat Grass: గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?
డయాబెటిక్ వ్యక్తులకు..
బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, సెలీనియం, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్, అమైనో యాసిడ్‌లు కూడా బ్లాక్ వీట్‌లో ఉంటాయి.దీన్ని రోజూ మితంగా తీసుకోవాలి. ఇది డయాబెటిక్ వ్యక్తులకు రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ ను నిర్వహించడంలో సహాయపడుతుంది. బ్లాక్ గోధుమ ఊబకాయాన్నికూడా తగ్గించగలదని కొన్ని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. బ్లాక్ గోధుమ సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, ఇతర జీర్ణశయాంతర వ్యాధులకు చెక్ పడుతుంది. నల్ల గోధుమలతో రోటీలు, కుకీలు, ఇడ్లీలు, చిల్లాలు, చపాతీలు చేసుకొని తినొచ్చు.