Adani Metaverse : మెటావర్స్ లో అదానీ స్కిల్ సెంటర్.. ఏం నేర్పిస్తారంటే ?

అదానీ గ్రూప్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ మెటావర్స్ (Adani Metaverse)లో ప్రపంచంలోనే మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను "అదానీ సక్షం" ప్రారంభించింది.

  • Written By:
  • Updated On - May 17, 2023 / 11:54 AM IST

అదానీ గ్రూప్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ మెటావర్స్ (Adani Metaverse)లో ప్రపంచంలోనే మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను “అదానీ సక్షం” ప్రారంభించింది. దీనికి అదానీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ASDC) అని పేరు పెట్టింది. ఈ మెటావర్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లో రెండు కోర్సులను ప్రవేశపెట్టింది.
హెల్త్‌కేర్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌లో జాతీయ ఆవశ్యకతను గుర్తించి జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (GDA), మెటావర్స్‌ లో ఫైర్ సేఫ్టీ వంటి కోర్సులను ఇంట్రడ్యూస్ చేసింది. భవిష్యత్తులో మరిన్ని కోర్సులను ప్రవేశపెడతామని వెల్లడించింది. ఈ కోర్సుల్లో చేరేవారికి ఎంచుకున్న ఫీల్డ్‌పై మెటావర్స్ లో లోతైన అవగాహన వచ్చేలా చేస్తారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో 40 అదానీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల (Adani Metaverse) ద్వారా ఔత్సాహికులు ఈ వర్చువల్ కోర్సుల్లో చేరొచ్చు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉపయోగించి వీటి క్లాస్ లు వినొచ్చు. VR హెడ్‌సెట్ సహాయం లేకుండానే వారి స్క్రీన్‌పై వర్చువల్ తరగతి గదిని చూడొచ్చు.

also read : Meta : “ఫేస్ బుక్ పే” ఇకపై “మెటా పే”.. మెటా వర్స్ కోసం “నోవి” వ్యాలెట్!

మెటావర్స్ అంటే తెలుసా ?

మెటావర్స్ (Metaverse) అనేది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. ఫిజికల్ రియాలిటీ, ఫోన్ సహాయంతో పనిచేసే ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, AR set సాయంతో పనిచేసే వర్చువల్ రియాలిటీలను కలిపితే వచ్చిందే మెటావర్స్ టెక్నాలజీ. ఓ రకంగా ఇది ఫ్యూచరిస్టిక్ 3డీ ఇంటర్నెట్, 3డీ వీడియో గేమ్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది. వీడియో కాలింగ్ యాప్స్ తో ఫోన్ లో మాత్రమే ఫ్రేమ్ లో ఉండి మనం ఒకరిని ఒకరం చూసుకోగలుగుతాం.. కానీ మెటావర్స్ లో నేరుగా మీటింగ్ లో మీ చైర్ లో మీరు కూర్చుని పాల్గొనొచ్చు. అక్కడ ఉండేది వర్చువల్ మనిషే కానీ…. రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందన్న మాట.

రిక్రూట్మెంట్ లో దూసుకుపోతున్న ఫేస్ బుక్

మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేసేందుకు ఇప్పటికే యూరప్ లో పదివేల మంది టెకీలను స్పెషల్ గా రిక్రూట్ చేసుకుంది ఫేస్ బుక్. రాబోయే రోజుల్లో లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని కంపెనీ తెలిపింది. సోషల్ మీడియా స్థాయి నుంచి.. తాము… జనాన్ని అనుసంధానించే వ్యవస్థలోకి అప్ గ్రేడ్ కాబోతున్నామని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త టెక్నికల్ వరల్డ్ క్రియేట్ చేసేందుకు లక్షల మంది సాంకేతిక నిపుణులు నిరంతరం పనిచేస్తున్నారని కంపెనీ స్టేట్ మెంట్ ఇచ్చింది. మెటావర్స్ ను రియాలిటీ లోకి తెచ్చేందుకు మైక్రోసాఫ్ట్, Nvidia, ఫేస్ బుక్ INC, EPIC గేమ్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఫేస్ బుక్ దీనికోసం భారీస్థాయిలో కసరత్తు చేస్తోంది. మెటావర్స్ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటోంది. మెటావర్స్ లో ఏం చేసినా… ఎక్కడికి వెళ్లినా.. అన్నింటికీ కమ్యూనిటీ స్టాండర్స్ కు లోబడి మాత్రమే చేయాల్సి ఉంటుందని… పూర్తి పర్యవేక్షణ, నిఘా ఉంటాయని కంపెనీ సూచిస్తోంది.