Site icon HashtagU Telugu

Adani Group – Hindenburg : అదానీ గ్రూప్‌కు క్లీన్ చిట్.. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారం

Adani Group – Hindenburg

Adani Group – Hindenburg

తీవ్ర దుమారం రేపిన హిండెన్ బర్గ్ నివేదిక అంశంలో అదానీ గ్రూప్ కు (Adani Group – Hindenburg) ఊరట లభించింది. దీనిపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ అభ్య మనోహర్ సప్రే నేతృత్వంలో నందన్ నీలేకని సహా పలువురు  సభ్యులుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు(Adani Group – Hindenburg)  ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్‌ వాటి షేర్ల రేట్లను  పెంచి చూపిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

also read : Hindenburg: మరో దెబ్బ కొట్టిన హిండెన్ బర్గ్.. ఈ సారి ట్విట్టర్ మాజీ సీఈవో వంతు..!

ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడుల్లో ఎలాంటి మోసం జరుగలేదని నిపుణుల కమిటీ పేర్కొంది. రెగ్యులేటరీ సంబంధిత  అవకతవకలు జరిగాయనేది అబద్ధం అని నిపుణుల కమిటీ నిర్ధారించింది. విదేశీ పెట్టుబడులు లీగల్ గానే ఉన్నాయని వెల్లడించింది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది.  ఈనేపథ్యంలో ఒక్కసారిగా అదానీ షేర్ల విలువ పెరిగింది.