ఆపండి.. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నార్మల్‌గా మనం చూసే సినిమాల్లో ఈ డైలాగ్ వరుడి తండ్రో లేక పోలీసో చెప్తుంటారు. కానీ… వెరైటీగా వరుడే.. అదీ తాళి కట్టే టైమ్‌కి ఆపండి అని అరిచాడు. ఎందుకో తెలుసుగా.. కరెక్ట్. కట్నం కోసం. బీహార్‌లో జరిగిన ఈ తంతంగమంతా వీడియోలో రికార్డ్ అవడంతో ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీహార్‌లోని చప్పల్‌పూర్ గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కుదరక కుదరక ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. లాంఛనాలు, కట్నాలు అన్నీ మాట్లాడేసుకున్నారు. పెళ్లి సమయానికి ఇచ్చేలా ఒప్పందమూ అయింది. అయితే, అనుకోని కారణాలతో పెళ్లివారు ముహూర్తం సమయానికి ఆ కట్నాలేవో ఇవ్వలేకపోయారు. దీంతో వరుడు ఫైరైపోయాడు. కాబోయే పెళ్లాం పక్కనుండగానే పెళ్లి లేదు గిల్లి లేదు చల్ దొబ్బేయండంటూ గోల మొదలుపెట్టాడు.
పెళ్లికొచ్చినవాళ్లంతా ఆ కట్నమేదో ఇచ్చేస్తారులే ముందు తంతు కానీయమని బతిమిలాడినా నో యూజ్. మనోడు తాళి కట్టేది లేదంటే లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అసలే కట్నం అడగడం నేరం. అదీ బహిరంగంగా. ఇంకేముంది మన మీడియా వాళ్లు పెళ్లి పందిట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
https://twitter.com/humlogindia/status/1500366569506938884
విన్నారుగా..నాకు కట్నం అందలేదు. ఇస్తానన్నవేమీ ఇవ్వలేదు. చైన్ కూడా రాలేదు. ఇంకెందుకు పెళ్లి చేసుకోవాలి? అని ఏకంగా కెమెరా ముందే చెప్పేస్తున్నాడు. కట్నం తీసుకోవడం నేరం కదరా బాబూ అంటే.. తీసుకోలేదు కాబట్టి మీకు తెలిసింది. తీసుకునేవాళ్లు లక్షలమంది ఉన్నారు. మీకు తెలుసా ఏంటి అని ఆన్ రికార్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఈ వీడియో కాస్త ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. జనం కూడా తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
https://twitter.com/Doc_Kshatrani/status/1500853981806952449
We are in 21st century, still with us… https://t.co/AYW9i9h6Rl
— Rambabu Sah (@Rambabu858) March 7, 2022
https://twitter.com/witchs_broom/status/1500833152440299522
Why these government servants (father and son) should not be expelled from their jobs and benefits snatched? @NitishKumar ji 🙏🏼 @narendramodi ji 🙏🏼
Take strict action against violators and girl abusers @YChildMarriage https://t.co/C4jBF2ljqM— Independent Thought 🇮🇳 (@ithoughtindia) March 7, 2022