Garuda Puranam: గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌నం ధ‌న‌వంతులం కావాలంటే..!

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సనాతన ధర్మంలో మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఇందులో ప్రతి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది.

Published By: HashtagU Telugu Desk
Garuda Puranam

Garuda Puranam

Garuda Puranam: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సనాతన ధర్మంలో మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఇందులో ప్రతి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం గరుడ పురాణం (Garuda Puranam) అనేది ఒక వ్యక్తి పుట్టుక నుండి అతని మరణం వరకు ప్రతిదీ వివరంగా వివరించబడిన పుస్తకం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం గరుడ పురాణంలోని మొత్తం శ్లోకాల సంఖ్య 19 వేలు. ఈ 19 వేల శ్లోకాలలో మానవులకు సంబంధించిన 7 వేల శ్లోకాలున్నాయి. మత విశ్వాసాల ప్రకారం.. ఎవరైనా చనిపోయిన తర్వాత ఇంట్లో గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వ్యక్తి ఆత్మ ఆ ఇంట్లో 13 రోజులు నివసిస్తుందని నమ్ముతారు. ఆత్మకు శాంతి, మోక్షం కలగాలంటే ఇంట్లో గరుడ పురాణం పఠిస్తారు.

మానవ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి. ఇది న‌మ్మితే వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు. కాబట్టి ఈ రోజు ఈ వార్తలో మనం గురుద్ పురాణంలో మానవులకు సంబంధించిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: Chennai woman suicide: నాల్గవ అంతస్తు నుంచి కిందపడి బ్రతికిన చిన్నారి తల్లిపై ట్రోల్‌.. తల్లి ఆత్మహత్య

గరుడ పురాణంలోని 5 విషయాలను గుర్తుంచుకోండి

  • గరుడ పురాణం ప్రకారం.. ప్రతిరోజూ మురికి బట్టలు ధ‌రిస్తే.. వారి జీవితంలో ఆర్థిక సంక్షోభం మొదలవుతుంది. అందువల్ల ధనవంతులు కావాలనుకుంటే ప్రతిరోజూ శుభ్రమైన బట్టలు ధరించాల‌ని రాసి ఉంది. రోజూ శుభ్రమైన దుస్తులు ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని, మన పూర్వీకులు కూడా సంతోషిస్తారని అందులో పేర్కొన్నట్లు చెబుతుంటారు.
  • మీరు ప్రతిరోజూ తులసి మొక్క‌ని పూజిస్తే మీరు ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందుతారు. దీనితో పాటు అన్ని రకాల వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
  • గరుడ పురాణం ప్రకారం.. ప్రతిరోజూ స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి.
  • ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేచేవారికి దీర్ఘాయుష్షు ఉంటుందని నమ్ముతారు. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండదు. అలాగే లక్ష్మిదేవి వారి వ‌ద్ద‌నే సంతోషంగా ఉంటుంది.
  • మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే నిజమైన హృదయంతో పేద వ్యక్తికి దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 20 May 2024, 06:02 PM IST