AAP : రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిం: మంత్రి అతిశీ

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 12:14 PM IST

AAP: ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్‌తో దేశరాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. తమ సుప్రిమోను తప్పుడు కేసులో, రాజకీయ కక్షతోనే బీజేపీ (BJP) ప్రభుత్వం అరెస్ట్‌ చేయించిందని ఆప్‌ ఆరోపిస్తోంది. తాజాగా మరోసారి ఆప్‌ ప్రభుత్వం బీజేపీపై నిప్పులు చెరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

రాజధానిలో రాష్ట్రపతి పాలన (Presidents Rule) విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్‌ మంత్రి (AAP Minister) అతిశీ తాజాగా ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో అతిశీ మాట్లాడుతూ.. ‘ఎలాంటి ఆధారాలూ లేకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని (Delhi government) కూలదోసేందుకు కుట్ర జరుగుతోంది. గతంలో జరిగిన కొన్ని విషయాలు చూస్తే కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోంది’ అని మంత్రి అతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ప్రైవేట్‌ సెక్రటరీని తొలగిచడం కూడా కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు.

Read Also: Hrithik Roshan NTR Natu Natu : వార్ 2లో మరో నాటు నాటు.. అదే నిజమైతే కెవ్వు కేక..!

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా అధికార నియామకాలను చేపట్టడం లేదని అతిశీ తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయని చెప్పారు. ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచీ అధికారులు సమావేశాలకు కూడా హాజరుకావడం మానేశారని మంత్రి వెల్లడించారు.