Site icon HashtagU Telugu

Aadhaar With Toe Prints : కాలి వేలిముద్రలతో రెండో ఆధార్..లోన్ కోసం బరితెగింపు

Aadhaar With Toe Prints

Aadhaar With Toe Prints

ఆధార్ నంబర్ ను ఒక వ్యక్తికి ఒకేసారి జారీ ఇస్తారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న బోగస్ ‘జన సేవా కేంద్రం’ నిర్వాహకులు మాత్రం కొందరి పేరిట రెండోసారి ఆధార్ (Aadhaar With Toe Prints) కోసం అప్లై చేశారు. ఇప్పటికే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తుల కోసం మరోసారి ఆధార్ నంబర్‌లను జనరేట్ చేసే క్రమంలో.. వారి నుంచి కాలి ముద్రలు, ఒక చేతి బొటన వేలి ముద్రలు సేకరించి UIDAI పోర్టల్ లో సబ్మిట్ చేశారు. ఆధార్ డేటాబేస్ కు దొరకకుండా ఉండేందుకు.. ఇప్పటికే చేతి వేలిముద్రలు సబ్మిట్ చేసిన వాళ్ల తరఫున అప్లై చేసేటప్పుడు కాలి వేలిముద్రలను(Aadhaar With Toe Prints) తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఇక రెటీనా స్కాన్‌లను మార్ఫింగ్ చేసి రెండోసారి ఆధార్ నంబర్ కోసం సబ్మిట్ చేశారని గుర్తించారు. ప్రస్తుతం ఈ ముఠా పరారీలో ఉందని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ముఠా సభ్యులను అరెస్టు చేయడానికి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ విధంగా ఎంతమందికి రెండో ఆధార్ నంబర్ ను జనరేట్ చేశారో తెలుసుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారు.

ALSO READ : Aadhaar Photo Update : ఆధార్ కార్డ్‌లో ఉన్న ఫొటో నచ్చలేదా? అయితే వెంటనే ఇలా మార్చకోండి.

రెండో ఆధార్ నంబర్ ఎందుకు క్రియేట్ చేశారు ?

బ్యాంక్ లోన్ కు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తారు. సిబిల్ చెక్ చేసేటప్పుడు లోన్ కు అప్లై చేసే వ్యక్తి ఆధార్ నంబర్, పాన్ కార్డు నంబర్ లను ఎంటర్ చేస్తారు. ఇప్పటికే లోన్స్ ఎగ్గొట్టిన చరిత్ర ఉన్నవాళ్ళ ఆధార్ నంబర్ , పాన్ నంబర్ ఎంటర్ చేస్తే లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది .ఇలాంటి బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ ఉన్నవాళ్లే .. రెండో ఆధార్ నంబర్ కోసం అప్లై చేశారని తెలుస్తోంది. రెండో ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి బ్యాంక్ లోన్ పొందాలని వాళ్ళు స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నోయిడాలోని సెక్టార్ 63 లో నడుస్తున్న బోగస్ ‘జన సేవా కేంద్రం’ నిర్వాహకులను వారు కలిశారని పోలీసులు గుర్తించారు. ఎలాగైనా తమకు రెండో ఆధార్ నంబర్ కావాలని అడగడం వల్లే కాలి వేలిముద్రలను , మార్ఫింగ్ చేసిన రెటీనా స్కాన్ లతో ఆధార్ పోర్టల్ లో అప్లై చేశారని తేలింది. ఢిల్లీకి చెందిన కొందరు బ్యాంకు అధికారుల సహకారంతోనే .. పర్సనల్ లోన్ కు అప్లై చేసే వారికి బోగస్ ‘జన సేవా కేంద్రం’ ఈ అక్రమ లబ్ది చేకూరుస్తోందని అంటున్నారు. తెరవ వెనుక ఉండి .. ఈ ముఠాను నడిపిస్తున్న బ్యాంకు అధికారులను కూడా గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. బోగస్ ‘జన సేవా కేంద్రం’ నిందితుల నుంచి పలు ఆధార్ కార్డులు, 15 పాన్ కార్డులు, ఐరిస్ రెటీనా స్కానర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version