Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో సందేహాలు ఉన్నాయా.. టోల్ ఫ్రీ నెంబర్ మీకోసం?

భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక భారతీయుడికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 08:45 AM IST

భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక భారతీయుడికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం అందాలి అన్న అలాగే చిన్న చిన్న అవసరాలకు కూడా ఈ ఆధార్ కార్డు తప్పనిసరి. పుట్టిన దగ్గరనుంచి చివరికి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో ఈ ఆధార్ కార్డుని తప్పనిసరిగా ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే ఆధార్ సమస్యలతో నిత్యం కొన్ని వందలాది మంది ఆధార్ కేంద్రాల చుట్టూ, ప్రైవేట్ బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు.

ఆధార్ కార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన ఏదైనా వివరాలను అడిగి తెలుసుకోవడానికి ప్రజలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో ఇలా పలు రకాల ఆధార్ కార్డు సమస్యలతో ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆధార్ కు సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్లి గంటల తరబడి నిలబడి పరిష్కరించుకోవాలి. అయితే ఈ బాధలకు విముక్తిని కలిగిస్తూ తాజాగా హైదరాబాద్‌ యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం ఓ ట్వీట్‌ చేసింది.

ఆధార్‌కు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉన్నా టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించి పరిష్కరించుకోవచ్చని తెలిపింది. ఏవైనా ప్రశ్నలు ఉంటే టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1947కు సంప్రదించాలని కోరింది. ఇక ఈ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేసే సమయం విషయానికొస్తే..ప్రతి రోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్‌ ప్రీ నెంబర్‌ను సంప్రదించి ప్రశ్నలకు సమాధానం అందుకోవాలని ట్వీట్‌లో పేర్కొంది. IVRS మోడ్‌లో ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ 24X7, 365 రోజులు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది.