Hyderabad: సాధారణంగా పోలీసులు రంగంలోకి దిగితే ఎంతటి దొంగలైనా దొరికిపోవాల్సిందే. కానీ ఓ గల్లీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీ చేసేందుకు ప్రయత్నించిన దొంగ కళ్లెదుటే దొంగ కనిపిస్తున్నా.. పట్టుకోలేని పరిస్థితి పోలీసులది.
శుక్రవారం సాయంత్రం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసి పారిపోయేలోపు ఇంటి యజమాని వచ్చాడు. ఇంటి యజమాని నుంచి తప్పించుకునే క్రమంలో దొంగ చెరువులోకి దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దొంగను చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా.. పట్టుకోండి చూద్దాం! అన్నట్టు చెరువు మధ్యలోనే తిష్ట వేశాడు. చీకటి పడటంతో దొంగను ఎలా పట్టుకోవాలా అని పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన స్థానికుల్లో ఆసక్తిని రేపుతోంది. భలే దొంగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Chetan Sakariya: టీమిండియా యువ బౌలర్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!