Viral Video : కెమెరాను మింగేసిన టైగ‌ర్ షార్క్‌…!

స‌ముద్రంలో ఓ టైగ‌ర్ షార్క్ కెమెరాని మింగ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది.

  • Written By:
  • Updated On - April 25, 2022 / 12:22 PM IST

స‌ముద్రంలో ఓ టైగ‌ర్ షార్క్ కెమెరాని మింగ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. టైగ‌ర్ షార్క్ ఒక్క‌సారిగా కెమెరాని నోటితో ప‌ట్టేసుకుని స్విమ్మింగ్ చేస్తూ కొరికేసిన‌ట్లు వీడియోలో ఉంది. ఈ క్లిప్‌కి వేల సంఖ్యలో వీక్షణలు, టన్నుల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి. 78 వేలకు పైగా వీక్షణలు వ‌చ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో సొరచేప శరీరం లోపలి భాగాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆధునిక నిర్మాణంతో కూడిన అపార్ట్మెంట్ స్తంభాలను దాదాపుగా పోలి ఉందని వ్యాఖ్యానించారు. కొందరు కెమెరా పరిస్థితి గురించి కూడా ఆరా తీశారు.