Only Ram : జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరిగాక.. దేశంలో రాజకీయ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుందని ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తుందని తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం రామమందిరం చుట్టూ తిరుగుతుంది.కుల గణన అనేది హిందూ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వేస్తున్న ఒక ఎత్తుగడ. రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి కాంగ్రెస్ వేసిన ఈ ప్రణాళిక విజయవంతం కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. “కులాల లెక్క తెలుసుకోవాలని కాంగ్రెస్‌కు అంతగా ఆసక్తి ఉంటే.. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణనను ఎందుకు నిర్వహించలేదు ? కులాల ప్రస్తావన తీసుకురావడం అనేది.. బీజేపీ సాధించిన హిందూ ఏకీకరణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ప్రజలు దీని బారిన పడరు’’ అని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ.. హిందూ ధర్మం..
“కాంగ్రెస్ సహా పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సామాజిక కార్యకర్త ఇప్పుడు మన సంస్కృతిలో రాముడి ఉనికిని అంగీకరించారు. ప్రతి భారతీయుడికి రాముడితో ఉన్న సహజమైన ఆధ్యాత్మిక అనుబంధం గురించి ఇప్పుడు బహిరంగంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మేం ఎప్పటినుంచో కోరుకుంటున్నది ఇదే’’ అని ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు తెలిపారు. ‘‘ ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ ఆలయాల డెవలప్మెంట్ కోసం ప్రత్యేక పనులు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తనను తాను హనుమాన్ భక్తుడిగా చెప్పుకుంటున్నారు. జనవరి 22 తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ రాముడి గురించే మాట్లాడుతుంది’’ అని ఆయన(Only Ram) వ్యాఖ్యానించారు.