Fire Accident : హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు.
మాదాపూర్‌లోని కృష్ణ కిచెన్లో అగ్ని ప్రమాదం
మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.#FireAccident #hyderabad #Telangana #NewsTAP pic.twitter.com/2Zr6b06FRX
— NewsTAP (@NewsTAPLive) January 8, 2025
ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంజన్ మంటలు ఆర్పుతున్నారు. ఫైర్ ఇంజిన్ సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు అధికారులు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ చాలా వరకు కాలిపోయిందని హోటల్ యాజమాన్యం తెలిపింది. అగ్ని ప్రమాదం కారణంగా ఆ చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కథనాలు వస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Kapil Dev: కపిల్ దేవ్, బీసీసీఐ మధ్య వివాదం ఏంటి?