Faked Death – 20 Years Later : 20 ఏళ్ల క్రితం చనిపోయాడు.. ఇప్పుడు అరెస్టయ్యాడు

Faked Death - 20 Years Later : నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటికి వచ్చి తీరుతుంది.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 10:58 AM IST

Faked Death – 20 Years Later : నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటికి వచ్చి తీరుతుంది. హర్యానాకు చెందిన 60 ఏళ్ల  బాలేష్ కుమార్‌ వ్యవహారంలోనూ 20 ఏళ్ల తర్వాత ఇదే జరిగింది. 8వ తరగతి వరకు చదువుకున్న అతడికి 1981లో నేవీలో జాబ్ వచ్చింది.  1996లో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం ప్రారంభించి కుటుంబంతో సహా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో నివసించేవాడు. ఇక్కడి దాకా అంతా ఓకే. ఆ తర్వాత అతడు ఒక చీటింగ్ కు పాల్పడ్డాడు. బాలేష్ కుమార్‌ సోదరుడి పేరు సుందర్ లాల్.  బాలేష్ కుమార్‌, సుందర్ లాల్ లు 2004లో ఒకరోజున ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లీ ఏరియాలో రాజేష్ అనే వ్యక్తిని కలిశారు. ముగ్గురూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ముగ్గురూ బాగా మద్యం తాగారు.  బాలేష్ కుమార్‌, రాజేష్ భార్య మధ్య వివాహేతర సంబంధం అంశంపై గొడవ చెలరేగింది. ఈక్రమంలో బాలేష్, సుందర్ సోదరులు కలిసి.. మద్యం మత్తులో ఉన్న రాజేష్ ను గొంతు నులిమి చంపేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం ఎస్కేప్ ప్లాన్ ను బాలేష్ రెడీ చేశాడు.  ఇందులో భాగంగా ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లీ అడ్డాకు వెళ్లి ఇద్దరు బీహారీ కూలీలు మనోజ్, ముఖేష్ లను తీసుకొచ్చారు. ఆ ఇద్దరు కూలీలను తీసుకొని.. సోదరుడు సుందర్ లాల్ కు చెందిన ట్రక్కులో రాజస్థాన్‌కు బయలుదేరాడు. జోధ్‌పూర్ వద్ద ఈ ట్రక్కును ఆపేసిన బాలేష్ కుమార్‌..కూలీలతో కలిపి ఆ ట్రక్కుకు నిప్పంటించాడు. ఆ తర్వాత ఇద్దరి కూలీలలో ఒకరి డెడ్ బాడీ దగ్గర తన ఐడెంటిటీ కార్డులను పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రాజేష్ మర్డర్ కేసును విచారించిన పోలీసులు.. బాలేష్ కుమార్‌ సోదరుడు సుందర్ లాల్ ను అరెస్టు చేశారు. డెడ్ బాడీ దగ్గరున్న ఐడీ కార్డుల ఆధారంగా బాలేష్ చనిపోయాడని కోర్టుకు రిపోర్టు పంపింది. దీంతో బాలేష్ భార్య పెన్షన్ ప్రయోజనాలు, జీవిత బీమా మొత్తాన్ని పొందింది. లారీకి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా అతడి భార్యకే వచ్చింది.

Also Read: Andhra Settlers Votes : కేటీఆర్ వల్ల ఏపీ సెటిలర్ల ఓట్లు బిఆర్ఎస్ కు పడకుండా అయ్యాయా..?

తాజాగా బీహారీ కూలీలు, రాజేష్ మర్డర్ ఫైలును మరోసారి తెరిచిన రాజస్థాన్ లోని జోధ్ పూర్ పోలీసులు ఆరాతీయగా.. బాలేష్ కుమార్‌ బతికే ఉన్నాడని తెలిసింది. దీనిపై దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్.. బాలేష్ కుమార్ తన పేరును అమన్ సింగ్‌గా మార్చుకొని ఢిల్లీలో ప్రాపర్టీ డీలర్‌గా చలామణి అవుతున్నాడని గుర్తించింది. ప్రస్తుతం అతడి వయసు 60 ఏళ్లు. 20 ఏళ్ల తర్వాత పాపం పండి దొరికిపోయిన బాలేష్ ను పోలీసులు (Faked Death – 20 Years Later) అరెస్టు చేశారు.