Site icon HashtagU Telugu

Die Hard Fan: బాలయ్య కోసం వాగులో దూకేసిన అభిమాని.. వీడియో వైరల్!

Balakrishna

Balakrishna

హిందుపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్యకు మాస్ లో మంచి  క్రేజ్ ఉంది. ఇటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. ఏపీలో వరదల కారణంగా హిందూపురం జలమయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలించేందుకు వెళ్లగా, అవతలి వైపు ఉన్న ఓ అభిమాని వాగులో దూకి బాలకృష్ణను కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడు వాగులో కొంతదూరం కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.