Dr Shankare Gowda : 42 ఏళ్లుగా రూ.5 లకే వైద్యం అందిస్తున్న డాక్టర్

ప్రస్తుతం వేలల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్న ఈరోజుల్లో కూడా కేవలం టీ కూడా రాని రూ.5 లు మాత్రమే తీసుకోవడం ఒక్క శంకర్ కే చెల్లింది.

Published By: HashtagU Telugu Desk
5 Rs Doctor

5 Rs Doctor

ప్రస్తుతం చిన్న జబ్బు వచ్చిన ఆస్తులు అమ్ముకునే రోజులు వచ్చాయి. తలనొప్పిగా ఉందని డాక్టర్ వద్దకు వెళ్తే..పదుల సంఖ్యలో టెస్ట్ లు రాసి..వేలల్లో డబ్బులు గుంజి..ఫైనల్ గా రూ.2 ల తలనొప్పి టాబ్లెట్ వేసుకోండి సరిపోతుందని చెపుతున్నారు. ప్రభుత్వ హాస్పటల్స్ కు భయపడి..ప్రవైట్ హాస్పటల్స్ కు వెళ్తే ఆస్తులు రాయించుకుంటున్నారు. ఇలా అక్కడ ఇక్కడ అనే కాదు పట్టణం నుండి మహా నగరం వరకు చిన్న హాస్పటల్ నుండి పెద్ద హాస్పటల్ వరకు అందరు డాక్టర్స్ ఇలాగే ఉన్నారు. ఈ ఫీజులకు టెస్ట్ లకు అయ్యే డబ్బు కు భయపడి చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు. ఇలాంటి ఈరోజుల్లో రూ. 5 లకే వైద్యం అందిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు Dr Shankare గౌడ. అది కూడా గత 42 ఏళ్లుగా.

We’re now on WhatsApp. Click to Join.

కర్ణాటక – మాండ్యలో నివాసముంటున్న డాక్టర్ శంకర్‌ గౌడ అంటే పెద్దగా తెలియదు కానీ,.. ఐదు రూపాయల డాక్టర్ అని చెబితే చాలు.. చిన్న పిల్లవాడు కూడా దగ్గరుండి అతని వద్దకు తీసుకువెళతాడు. ఐదు రూపాయల డాక్టర్‌గా శంకర్‌గౌడ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ డాక్టర్‌. ఎంబీబీఎస్ చేసిన తర్వాత డాక్టర్ గౌడ మాండ్యాలో పని చేయకుండా వైద్యం చేయడం ప్రారంభించారు. పొలం, ఇంటి పనులు ముగించుకుని రోగులను చూసేందుకు కూర్చుంటాడు. ఒక నివేదిక ప్రకారం, అతను ఒక్కరోజులో 400 నుండి 500 మంది రోగులకు చికిత్స చేస్తాడు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి రోగులు డాక్టర్ గౌడ్ వద్దకు వస్తుంటారు. కేవలం ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నప్పటికీ పేదల నుండి ఆ ఐదు రూపాయలు కూడా తీసుకోడట. అంతేకాదు.. తను తీసుకుంటున్న ఐదు రూపాయల ఫీజు కూడా మందులు కొనుగోలు చేసి నిరుపేద రోగులకు పంపిణీ చేస్తున్నాడు. దీంతో ఆయనను ఆ ప్రాంత ప్రజలు ఎంతో గౌరవిస్తారు. సమాజం పట్ల ఆయనకున్న అంకితభావానికి గానూ ఆయనకు ప్రజల్లో ఎనలేని గౌరవం ఉంది. గత 42 ఏళ్ళు గా రూ.5 లకే వైద్యం అందిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం వేలల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్న ఈరోజుల్లో కూడా కేవలం టీ కూడా రాని రూ.5 లు మాత్రమే తీసుకోవడం ఒక్క శంకర్ కే చెల్లింది.

Read Also : Delhi Liquor Scam Case : కవిత కు బెయిల్ రాబోతోందా..?

  Last Updated: 20 Aug 2024, 10:52 AM IST