Sheikh Hasina: బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు బుక్ చేశారు. ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు. యువత ఆందోళనల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆ అల్లర్ల సమయంలో జరిగిన కాల్పుల్లో ఆ షాపు ఓనర్ అబూ సయ్యద్ మృతి చెందాడు. దీంతో అతడి స్నేహితుడు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాడు. దీంతో నాటి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతోపాటు మరో ఆరుగురిపై పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు మీడియా తెలిపింది. ఈ కేసు నమోదయిన వారి జాబితాలో అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్, హోమ్ శాఖ మాజీ మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ ఐజీ చౌదరి అబ్దుల్ అల్ మమున్‌లతోపాటు పోలీస్ శాఖలో అత్యున్నత అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఉన్నట్లు మీడియాలో వార్త కథనాలు అయితే వెలువడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
పరారీ అయిన తర్వాత 76 ఏళ్ల హసీనాపై నమోదైన తొలి కేసు ఇదే. గ్రాసరీ స్టోర్ ఓనర్ అబూ సయ్యద్‌కు చెందిన మిత్రుడు ఒకరు ఆ కేసును నమోదు చేశారు. అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదిర్, మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ చౌదరీ అబ్దుల్లా ఆల్ మమున్ ఈ కేసులో ఉన్నారు. అనేక మంది ఉన్నత స్థాయి పోలీసు, ప్రభుత్వ అధికారుల పేర్లను కూడా దీంట్లో చేర్చారు.
కాగా, ఆగస్టు 5వ తేదీన ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో ఆమె ప్రభుత్వం రద్దయింది. అనంతరం దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనల్లో దేశంలో 230 మందికిపైగా మరణించారు. ఇక ఈ ఏడాది జులైలో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రభుత్వం కర్ప్యూ విధించింది. ఈ సందర్బంగా దేశంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 560 మంది మరణించిన విషయం తెలిసిందే.