Site icon HashtagU Telugu

Taiwan : భూకంపం బీభత్సం.. ఏడుగురి మృతి.. 730 మందికి గాయాలు

7 Dead, 730 Injured As "Strongest Earthquake In 25 Years" Hits Taiwan

7 Dead, 730 Injured As "Strongest Earthquake In 25 Years" Hits Taiwan

Taiwan Earthquake: తైవాన్‌ రాజధాని తైపీ(Taipei)ని శక్తిమంతమైన భూకంపం (Taiwan Eartquake) వణికించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. 25 ఏండ్లలో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు. దీంతో అక్కడ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ఈ భూకంపం ధాటికి 730 మంది గాయపడినట్లు(730 people injured) స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజాగా 7కు(7 dead) పెరిగింది. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్ననేపథ్యంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని స్థానిక అధికారులు వెల్లడించారు. అప్పుడు నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి సుమారుగా 2,500 మందికి పైగా మరణించారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత 25 ఏండ్లలో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు.

Read Also: Judson Bakka : కాంగ్రెస్ పార్టీ నుంచి బక్క జడ్సన్ బహిష్కరణ..

తైవాన్‌లో భూకంపంతో జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్‌లోని దీవులకు సుమారు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది. సునామీ వస్తున్నదని, అందరూ ఇండ్లు ఖాళీ చేయాలని జపనీస్‌ జాతీయ వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేస్తున్నది. కాగా, తైవాన్‌లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. 1996లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది ప్రజలు మరణించారు. ఇక జపాన్‌లో ప్రతిఏటా సుమారు 1500 వరకూ భూకంపాలు వస్తుంటాయి.