Site icon HashtagU Telugu

Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

organ donor

organ donor

ఆరేళ్ల బాలిక తాను…మరణించి మరో ఐదుగురికి అవయదానం చేసింది. వారి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. అసలు విషయం ఏమిటి అంటే…నోయిడాలోని ఆరేళ్ల బాలిక రోలీ ప్రజాప్రతిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలిక కోమాలోకి వెళ్లింది. ఆ బాలికను కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించారు. బుల్లెట్ తలలోకి దూసుకుపోవడంతో..తలలో రక్తం గడ్డకట్టింది. దీంతో వైద్యులు పాప బ్రెయిన్ డేడ్ అయినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రుకలు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడు పూర్తి దెబ్బతిందని తెలిపారు. కాగా ఆసుపత్రి వైద్యులు బాలిక కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి వివరించారు. బాలిక అవయవదానానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్లు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాలేయం, మూత్రపిండాలు, కార్నియాలు, గుండె కవాటం ఇచ్చేందుకు అంగీకరించారు. వీటిని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురికి శస్త్రచికిత్స ద్వారా వారి ప్రాణాలు కాపాడారు. ఈ అవయవ దానంతో రోలీ ప్రజాపతి ఢిల్లీలోని ఎయిమ్స్ హిస్టరీలోనే అతి చిన్న వయస్కురాలైన దాతగా నిలిచింది.