Cobra: రాత్రి భోజనం చేసి నిద్రపోయేందుకు సిద్ధCobra: పడిన కుటుంబ సభ్యులు..ఆ తరువాత భయంతో పరుగులు?

తాజాగా రాజస్థాన్ లోని కోటకు సమీపంలో ఒక ఇంటిలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది.

  • Written By:
  • Updated On - June 19, 2022 / 10:01 AM IST

తాజాగా రాజస్థాన్ లోని కోటకు సమీపంలో ఒక ఇంటిలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు అందరూ రాత్రి భోజనం చేసి నిద్ర పోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా ఇంట్లో నుంచి హఠాత్తుగా ఏదో శబ్దం వినపడింది. దాంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు టార్చ్ లైట్ వేసి ఇల్లు మొత్తం వెతకగా అక్కడ ఆరడుగుల ఒక బ్లాక్ కోబ్రా ని చూశారు. ఆ పామును చూసి భయంతో అక్కడి నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

ఆ పామును చూసి ఒక్కసారిగా భయపడిపోయిన కుటుంబ సభ్యులు దగ్గర్లోని పర్యావరణ ప్రేమికుడు అయిన గోవింద శర్మ అనే వ్యక్తిని పిలిచారు. గోవింద శర్మ ఆ పాముని భద్రంగా తీసుకుని అడవిలో వదిలేశాడు. అయితే ఆ పామును చూసి భయపడిపోయిన కుటుంబ సభ్యులు దాదాపుగా ఒక రెండు గంటల సేపు ఇంటి బయటే ఉండిపోయారు. వర్షాకాలం మొదలైంది పాములు తరచుగా వారి బొరియల్లో నుంచి బయటకు వస్తుంటాయని, అవి ఎలుకల కోసం బయటకు జనావాస ప్రాంతాలకు వస్తుంటాయి అని పర్యావరణ ప్రేమికుడు గోవింద శర్మ చెప్పారు.

అయితే ఆ బ్లాక్ కోబ్రా శబ్దం చేయడం ద్వారా ఆ కుటుంబ సభ్యులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, ఒకవేళ ఆ పాము గనుక శబ్దం చేయకపోయి ఉంటే ఆ కుటుంబ సభ్యులను ఆ రోజు రాత్రి ఆ పాము ఏదైనా చేసి ఉండవచ్చు. మొత్తానికి ఆ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులు అని స్థానికులు చెబుతున్నారు.