Rozgar Mela : నేడు హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివ్రుద్ది కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వి.సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’ 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోడీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
Read Also: AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు
ఈ రోజు 15వ రోజ్ గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. అంటే దాదాపు 10 లక్షల మార్క్ కు చేరుకున్నట్లే… ఏ చిన్న అవినీతికి, పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా ఇన్ని లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం మామూలు విషయం కాదు. మోడీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కిందని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి పై స్పందించారు. పహల్గాం ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి అంగీకరించారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా నిలవాలన్నారు. పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని అన్నారు.
తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అగ్రభాగాన నిలిచేందుకు నిరంతరం కృషి చేస్తుందని బండి సంజయ్ అన్నారు.
Read Also: Central Govt : ఏపీకి రూ.1,121.20 కోట్లు విడుదల చేసిన కేంద్రం