రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతో ఐదుగురు మురుగు కాలువలో పడిపోయారు. నగరంలోని బాబా బావడి ప్రాంతంలో, రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న డ్రెయిన్‌పై పంక్చర్-రిపేర్ దుకాణం ఉంది. ఏప్రిల్ 7వ తేదీన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఒక వ్యక్తి వారి పక్కన మోటారుబైక్‌ను రిపేర్ చేస్తున్నప్పుడు నలుగురు వ్యక్తులు మాట్లాడుకోవడం చూడొచ్చు. భారీ వాహనాలకు పంక్చర్లు వేసే ఆ దుకాణం కింది భాగంలో మురుగు కాల్వ ప్రవహిస్తోంది. అయితే షాపు నిర్వాహకులు దానిపై కాంక్రీట్ స్లాబ్ ఏర్పాటు చేశారు. అయితే ఒకేసారి ఐదుగురు వ్యక్తులు ఆ ప్రాంతంలో నిల్చోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గుంతలోకి పడిపోయారు. ఆ తర్వాత మోటర్ బైక్ వాళ్లపై పడింది. సమీపంలో నిలబడిన ఓ వ్యక్తి వారికి సహాయం చేసేందుకు పరుగెత్తుతున్నట్లు వీడియోలో కనిపించింది. అదృష్టవశాత్తూ డ్రెయిన్ ఎండిపోవడంతో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Watch Video: కాంక్రీట్ స్లాబ్ కూలి.. మురుగు కాల్వలో పడిపోయి!

Viral