Site icon HashtagU Telugu

Mall : మాల్‌లో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం.. న‌లుగురి మృతి!

Stabbing

Stabbing

Sydney mall: ఆస్ట్రేలియా(Australia) రాజ‌ధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్‌(Shopping mall)లో క‌త్తిపోట్ల‌ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందిన‌ట్లు, ప‌లువురు గాయ‌పడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్ష‌న్ ప‌రిధిలో గ‌ల‌ వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు చ‌నిపోయిన‌ట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్ల‌డించింది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితుడిని పోలీసులు మ‌ట్టుబెట్టిన‌ట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ స్ప‌ష్టం చేసింది. కాగా, ఈ ఘ‌ట‌న‌తో షాపింగ్ మాల్‌లో ఉన్న‌ వంద‌ల సంఖ్య‌లో జ‌నం ఒక్క‌సారిగా ప‌రుగులు తీసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. దాంతో ప‌రిస్థితి భ‌యాన‌కంగా మార‌డంతో మాల్‌కు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల‌ను పోలీసులు అక్క‌డి నుంచి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిని అంబులెన్సులలో స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లారు.

Read Also: Rahul Gandhi Buys Mysore Pak: ఆ సీఎం కోసం మైసూర్ పాక్ కొన్న రాహుల్ గాంధీ..!