Site icon HashtagU Telugu

4 Pak Fishermen Caught: నలుగురు పాకిస్తాన్ మత్స్యకారుల పట్టివేత!

Pak Fishermen

Pak Fishermen

దేశ సరిహద్దు భద్రతా దళం (BSF) పెట్రోలింగ్ చేస్తుండగా నలుగురు పాకిస్తాన్ మత్స్యకారులు పట్టుబడ్డారు. గుజరాత్‌లోని భారతదేశం-పాకిస్తాన్ సముద్ర సరిహద్దు వెంబడి కచ్‌లోని ‘హరామీ నల్ల’ క్రీక్ ప్రాంతం వద్ద 10 పడవలను స్వాధీనం చేసుకున్నట్లు ఫోర్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఫిషింగ్ బోట్ల నుంచి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఏమీ లభ్యం కాలేదు. సరిహద్దు నంబర్ 1165, 1166 మధ్య సరిహద్దు భద్రతా దళం (BSF) దళం పెట్రోలింగ్ చేస్తుండగా, నీటి మార్గాలలో మత్స్యకారులు “భారత భూభాగంలోకి” ప్రవేశించినట్టు గుర్తించారు. 10 పడవలతో పాటు నలుగురు పాకిస్తానీ జాలర్లు పట్టుబడ్డారని, మొత్తం ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నామని ప్రతినిధి తెలిపారు.