January 1st – 4 Rules : న్యూ ఇయర్ 2024 వచ్చేస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో రాబోతున్న 4 కొత్త రూల్స్ గురించి మనం తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. ఆ మార్పులకు అనుగుణంగా ఈనెల 31లోగా కొన్ని మార్పులను మనం చేసుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా, పట్టించుకోకపోయినా కొంత అసౌకర్యానికి గురవుతాం. ఇంతకీ ఆ మార్పులు ఏమిటి ? వాటికి అనుగుణంగా మనం మారకపోతే ఎదురయ్యే అసౌకర్యాలు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
Gmail
మీరు మీ జీమెయిల్ అకౌంట్‌ను గత కొంతకాలంగా వాడటం లేదా ? అలాంటి జీమెయిల్ అకౌంట్లను జనవరి 1 నుంచి గూగుల్ మూసేస్తుంది. అయితే ఈ నిబంధన స్కూళ్లు, బిజినెస్‌ల జీమెయిల్ అకౌంట్లకు వర్తించదు. మీకు అలాంటి జీమెయిల్ అకౌంట్లు ఉంటే వాటిని ఒకసారి లాగిన్ కండి. దీంతో అవి యాక్టివ్ అయిపోతాయి.
SIM
కొత్త సంవత్సరం నుంచి కొత్త సిమ్ కార్డులు పొందడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రూల్స్ మారాయి. ఇక నుంచి న్యూ సిమ్ కార్డును పొందేందుకు బయోమెట్రిక్ సమాచారాన్ని సమర్పించడం తప్పనిసరి. దీనికి సంబంధించిన బిల్లు ఇప్పటికే రాజ్యసభ, లోక్‌సభలలో అప్రూవ్ అయింది. జనవరి 1 నుంచి ఈ బిల్లులోని నిబంధనలు అమల్లోకి వస్తాయి. అందుకే సిమ్ జారీ కోసం టెలికాం కంపెనీలు బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకోనున్నాయి.
UPI
చాలామందికి ఒకటికి మించి యూపీఐ ఐడీలు ఉంటాయి. కానీ అవన్నీ వాడరు. కొన్నే యూపీఐ ఐడీలనే వాడుతుంటారు. ఇలా వాడకుండా వదిలేసిన యూపీఐ ఐడీలు జనవరి 1 నుంచి పనిచేయవు. ఒకవేళ ఆ యూపీఐ ఐడీలను కూడా వాడాలి అనుకుంటే.. ఇప్పుడే వాటితో పేమెంట్స్ మొదలుపెట్టాలి. తద్వారా అవి యాక్టివేట్ అవుతాయి. అలా చేయకుంటే.. జనవరి 1 తర్వాత వాడకుండా వదిలేసిన యూపీఐ ఐడీలు డీ యాక్టివేట్ అయిపోతాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) యొక్క లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్ గడువు డిసెంబర్ 31తో ముగియబోతోంది. కొత్త లాకర్ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ఫామ్‌లను నింపి డిసెంబర్ 31లోగా సబ్మిట్ చేయాలి. లేదంటే ఇకపై లాకర్ సర్వీసును వాడలేరు.
DMAT
మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందా ? అయితే వెంటనే మీ నామినీ వివరాలను వచ్చే ఏడాది జూన్ 30లోగా(January 1st – 4 Rules) అప్ డేట్ చేయాలి. నామినీలను అప్‌డేట్ చేయని డీమ్యాట్ అకౌంట్లను ఆ తర్వాత వాడలేరు. అవి లాక్ అయిపోతాయి.