ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు. ఫిబ్రవరి 24న కీవ్‌పై రష్యా తన కొనసాగుతున్న దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి ఉక్రెయిన్‌లో కనీసం 346 మంది పిల్లలు యుద్ధానికి బలయ్యారు. 645 మంది పిల్లలు కూడా గాయపడ్డారని ఉక్రేయిన్ వెల్లడించింది. రష్యా దళాలు ఏమాత్రం కనికరం లేకుండా బాంబు దాడులు చేయడంతో ఉక్రెయిన్‌లోని 2,108 విద్యా సంస్థలు దెబ్బతిన్నాయి. వాటిలో 215 పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్‌లో 3 మిలియన్ల మంది పిల్లలు, ఆతిథ్యమిచ్చే దేశాలలో 2.2 మిలియన్లకు పైగా పిల్లలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలోని ప్రతి ముగ్గురి పిల్లల్లో ఇద్దరు వేరే దేశాలకు వెళ్లారు.
346 Children Killed: రష్యా యుద్ధానికి 346 మంది పిల్లలు బలి!

Ukrain.jpg1