Rupay Card New Features : ‘రూపే’ కార్డులో మూడు కొత్త ఫీచర్లు.. ఇవిగో

Rupay Card New Features :  రూపే క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? అయితే మీరు ఈ కొత్త అప్‌డేట్ గురించి తెలుసుకోవాలి.

  • Written By:
  • Updated On - April 3, 2024 / 02:12 PM IST

Rupay Card New Features :  రూపే క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? అయితే మీరు ఈ కొత్త అప్‌డేట్ గురించి తెలుసుకోవాలి. రూపే క్రెడిట్ కార్డు కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్లాట్‌ఫామ్ పై మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈవిషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ 3 కొత్త ఫీచర్ల విషయానికి వస్తే..  యూపీఐతో లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డును వాడుకొని మన లావాదేవీలను ఈఎంఐలలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.  యూపీఐతోనే క్రెడిట్ కార్డు అకౌంటుకు సంబంధించిన బిల్ పేమెంట్స్‌ను ఇన్‌స్టాల్‌మెంట్లలో చేయొచ్చు.  క్రెడిట్ కార్డు లిమిట్‌ను స్వయంగా యూజరే మేనేజ్‌ చేసుకోవచ్చు. ఇకపై జారీ చేసే  అన్ని రూపే క్రెడిట్ కార్డులలోనూ ఈ ఫీచర్లు(Rupay Card New Features) అందుబాటులోకి వస్తాయి.

We’re now on WhatsApp. Click to Join

క్రెడిట్ లైన్‌లను ఇక ఈజీగా.. 

రూపే క్రెడిట్ కార్డులను, వాటితో యూజర్‌కు ప్రీ శాంక్షన్ చేసిన క్రెడిట్ లైన్‌లను ఇప్పుడు మనం యూపీఐతో లింక్ చేసుకోవచ్చు. తద్వారా క్రెడిట్ కార్డులు, క్రెడిట్ లైన్స్‌ను మరింత ఈజీగా, సమర్థంగా వినియోగించుకోవచ్చు. క్యూఆర్ కోడ్స్ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లను స్వీకరించడం ద్వారా మర్చంట్స్‌కు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వారి వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. కస్టమర్లకు కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అదనంగా ఇప్పుడు జోడించిన మూడు కొత్త ఫీచర్లు యూజర్లకు మరింత ప్రయోజనం చేకూర్చనున్నాయి.

Also Read :BJP Vs Shinde : బీజేపీ వర్సెస్ ఏక్‌నాథ్ షిండే.. సీట్ల పంపకాలపై ‘మహా’ పంచాయితీ

యూపీఐతో లింక్ చేశాక..

రూపే క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేశాక.. మన ఒకవేళ క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐలోకి  మారిస్తే ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. బిల్లును ఈఎంఐగా కన్వర్ట్ చేసిన తర్వాత.. దాన్ని ఇక పూర్వ స్థితిలోకి మార్చలేం. యూపీఐ యాప్ ద్వారానే రూపే క్రెడిట్ కార్డు బిల్లులను మనం సులువుగా కట్టేయొచ్చు.  ఒకేసారి పేమెంట్ చేయొచ్చు. యూపీఐ ఆటో పే ఆప్షన్ ద్వారా ప్రతినెలా ఒక తేదీన డబ్బులు మన బ్యాంకు అకౌంట్ నుంచి కట్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులు యూపీఐ యాప్ ద్వారా తమ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచమని లేదా తగ్గించమని బ్యాంకుకు రిక్వెస్టు పెట్టుకోవచ్చు.

Also Read :Phone Tapping Case : మంత్రి కొండా సురేఖ కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు..