25000 policemen for ganesh immersion security: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా 25వేల మంది పోలీసులతో సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే అన్నిశాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
Read Also: AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహకులతో చర్చించామని.. దానికి వాళ్లు అంగీకరించారని తెలిపారు. నగర వ్యాప్తంగా అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమారు లక్ష వరకు ఉండొచ్చన్నారు. 17న వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు. తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్‌సాగర్ పరిసరాలకు వస్తారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు.
మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొంటే సహించేది లేదని.. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాలు జరిగే ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి పొలిటికల్ ర్యాలీలకు అనుమతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వేడుకలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.