Rajasthan : 25 పెళ్లిళ్లు..లక్షల రూపాయల మోసం.. నిత్య పెళ్లికూతరు అరెస్టు

ప్రతిసారి ఆమె పేరు మార్చేది, నగరం మార్చేది, కొత్త గుర్తింపు తీసుకుని వధువుగా నమ్మకాన్ని పొందేది. చివరికి  ఆ కుటుంబాన్ని మోసం చేసి పరారవుతుండేది. కానీ ఈసారి పోలీసులు తామే 'ఉనో రివర్స్' ఆడుతూ ఆమెను వలలో పడేశారు.

Published By: HashtagU Telugu Desk
25 marriages... fraud of lakhs of rupees... Nithya the bride and groom arrested

25 marriages... fraud of lakhs of rupees... Nithya the bride and groom arrested

Rajasthan : పెళ్లి పేరిట 25 మంది అమాయక పురుషులను మోసం చేసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలతో గల్లంతైన మహిళను రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె పేరు అనురాధా పాస్‌వాన్, కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆమెను ‘లూటేరు దుల్హన్‌’గా పిలుస్తున్నారు. ప్రతిసారి ఆమె పేరు మార్చేది, నగరం మార్చేది, కొత్త గుర్తింపు తీసుకుని వధువుగా నమ్మకాన్ని పొందేది. చివరికి  ఆ కుటుంబాన్ని మోసం చేసి పరారవుతుండేది. కానీ ఈసారి పోలీసులు తామే ‘ఉనో రివర్స్’ ఆడుతూ ఆమెను వలలో పడేశారు.

‘బీచరా అందమైన వధువు’ కథతో మోసం

32 ఏళ్ల అనురాధా పాస్‌వాన్‌ ప్రతి సారి తనను తాను నిరుపేద, అనాథ, తమ్ముడు నిరుద్యోగి అని చెప్పుకుంటూ, పెళ్లి కావాలన్న కల ఉందన్న భావోద్వేగాలతో పరిచయం చేసేది. కానీ వాస్తవానికి ఆమె ఒక మోసాల ముఠాకు నాయకురాలు. ఈ ముఠా అత్యంత వ్యవస్థాత్మకంగా పని చేస్తోంది. ఆమె ఫొటోలు, బయో డేటాను మోసపూరిత బిచౌళీలు సంబంధాల కోసం చూపిస్తూ రూ.2 లక్షల వరకు వసూలు చేస్తారు. ఒకసారి సంబంధం కుదిరితే, ఒక నకిలీ ఒప్పంద పత్రం తయారు చేసి, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆలయంలో లేదా ఇంట్లో హిందూ సంప్రదాయానుసారంగా పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత అనురాధా ఒక ఆదర్శవంతమైన కోడలు, భర్తను గౌరవించే భార్యగా నటించడం ప్రారంభిస్తుంది. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకున్న తర్వాత, తుది దశలో నిద్ర మాత్రలు కలిపిన ఆహారం పెట్టి అందరినీ స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అనంతరం నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్‌ ఫోన్‌ వంటివి తీసుకుని పరారవుతుంది.

విష్ణు శర్మ కథ

ఏప్రిల్ 20న, సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ అనురాధాతో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి బిచౌలియా పప్పు మీనా ద్వారా ఏర్పాటు చేయబడింది. ఆయనకు రూ.2 లక్షలు చెల్లించారు. పెళ్లి జరిగిన రెండు వారాల్లోపే అనురాధా రూ.1.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ.30,000 నగదు మరియు రూ.30,000 విలువైన మొబైల్‌తో అదృశ్యమైంది. “నేను బండి నడిపిస్తాను. పెళ్లి కోసం అప్పు చేశాను. మొబైల్ కూడా అప్పుగా తెచ్చుకున్నాను. ఇంతటి మోసం జరుగుతుందని ఊహించలేదు ” అని విష్ణు చెప్పాడు. ఇక, ఆ రాత్రి గురించి చెప్పుతూ, “నేను పని చేసుకుని రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాను. తినడం అయ్యాక డీప్ స్లీప్‌లో పడిపోయాను. ఎవరో నిద్ర మాత్రలు ఇచ్చినట్లుంది,” అన్నారు. విష్ణు తల్లి ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల ‘ఊనో రివర్స్’ యాక్షన్

విష్ణు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సవాయ్ మాధోపూర్ పోలీసులు వ్యూహాత్మకంగా పథకం రచించారు. ఒక కానిస్టేబుల్‌ను నకిలీ వరుడిగా తయారు చేసి, బిచౌలియాతో సంబంధం పెట్టుకున్నారు. ఆ బిచౌలియా అనేక ఫొటోలు చూపగా, వాటిలో అనురాధా ఫొటో కూడా ఉండటంతో ఆమెను పకడ్బందీగా గుర్తించారు. “మేము పరిశీలించినప్పుడు వివాహ పత్రాలు అన్నీ నకిలీ అని తెలిసింది. మా బృందం నుంచి కానిస్టేబుల్‌ను వరుడిగా మారుస్తూ ఆమెను అదే బావిలో వదిలాం,” అని పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంలో అనురాధా పాస్‌వాన్‌ను భోపాల్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెతో పాటు ముఠాలో ఉన్న ఇతర సభ్యులపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆమెపై 25 మోసం కేసులు నమోదు కాగా, ఇంకా చాలామంది బాధితులు ముందుకు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: Toyota Kirloskar Motor : ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ ప్రకటించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్

  Last Updated: 20 May 2025, 04:21 PM IST