Site icon HashtagU Telugu

206 Kidney Stones: కిడ్నీలో 206 రాళ్లు…తొలగించిన వైద్యులు..!!

kidney stones

kidney stones

సాధారణంగా కడుపునొప్పి వస్తేనే తట్టుకోలేం. నానాయాతలు పడుతుంటాం. అలాంటిది కిడ్నీలో ఏకంగా 206 రాళ్లు ఉంటే ఎలా ఉంటుంది. ఆరు నెలలుగా భరించలేని నొప్పితో వీరమల్ల రామలక్ష్మయ్య బాధపడుతున్నారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సతో ఆ రాళ్లన్నింటిని తొలగించారు. నల్లగొండ జిల్లాకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్యకు కీ హోల్ సర్జరీతో రాళ్లను తొలగించారు. రామలక్ష్మయ్య నొప్పిని తట్టుకునేందుకు స్థానిక హెల్త్ ప్రాక్టిషనర్ దగ్గర చికిత్సతో తాతాల్కిక ఉపశమనం పొందేవాడు. కానీ రోజురోజుకు నొప్పి భరించలేకుండా మారడంతో విధులు కూడా నిర్వర్తించలేకపోయాడు.

అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పూల నవీన్ కుమార్…రామ లక్ష్మయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మూత్రపిండిల్లో ఎడమ వైపు రాళ్లు ఉన్నట్లు నిర్దారించారు. సీటీ క్యూబ్ స్కాన్ ద్వారా మళ్లీ నిర్దారించుకున్నారు. దీంతో రామలక్ష్మయ్యకు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చి…కీ హోల్ సర్జరీకి రెడీ చేశారు. దాదాపు గంట సేపు సర్జరీ చేసి ఆ రాళ్లన్నీంటిని తొలగించామని చెప్పారు.

సర్జరీ చేశాక కోలుకున్న రామలక్ష్మయ్య రెండో రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు తెలిపారు. డీ హైడ్రేషన్ వల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పాడుతున్నాయన్నారు. డీ హైడ్రేట్ కాకుండా మంచినీరు, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

Exit mobile version