Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Holidays : ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

Published By: HashtagU Telugu Desk
2025 Holiday List released by Telangana Govt

2025 Holiday List released by Telangana Govt

Telangana government : తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2025కి గానూ సెలవులను ప్రకటించింది. 27 సాధారణ సెలవులు ఉండగా, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వచ్చే సంవత్సరంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తేదీ(జూన్‌ 2) సెలవుల జాబితాలో లేకపోగా.. బోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది. ఇక కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వుల్లో పేరొన్నది.

 

Read Also: Anchor Pradeep : కూటమి ఎమ్మెల్యే ను పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ ప్రదీప్..?

  Last Updated: 09 Nov 2024, 03:44 PM IST