Site icon HashtagU Telugu

Military Rankings : ప్రపంచ మిలిటరీ ర్యాంకింగ్స్ విడుదల.. ఇండియా ర్యాంకు ఎంతో తెలుసా?

Military Rankings

Military Rankings

Military Rankings : 2024 సంవత్సరానికి సంబంధించిన ‘గ్లోబల్ ఫైర్‌ పవర్’ యొక్క ‘మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్’ విడుదలయ్యాయి.  ఇందులో ఆయుధ సంపత్తి, సైనిక బలం పరంగా అమెరికా నంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది. రష్యా, చైనాలు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ రక్షణరంగ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ ‘గ్లోబల్ ఫైర్‌పవర్’ ఈ నివేదికను ప్రచురించింది. ఈ ర్యాంకింగ్స్ ఇచ్చేందుకు ఆయా దేశాల  సైనికుల సంఖ్య, సైనిక పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం, అందుబాటులో ఉన్న వనరులు వంటి 60 కంటే ఎక్కువ అంశాలను  పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశాల ప్రాతిపదికన ఒక్కోదేశానికి ఒక్కో పవర్‌ ఇండెక్స్ స్కోర్‌ను ఇచ్చింది. ఎంత తక్కువ పవర్‌ ఇండెక్స్ స్కోర్‌ ఉంటే.. అంత ఎక్కువ మిలిటరీ పవర్ ఉన్నట్లు అర్థం. మొత్తం 145 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో(Military Rankings) ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీలు ఇవే..

  1. అమెరికా
  2. రష్యా
  3. చైనా
  4. భారతదేశం
  5. దక్షిణ కొరియా
  6. యునైటెడ్ కింగ్‌డమ్
  7. జపాన్
  8. తుర్కియే
  9. పాకిస్తాన్
  10. ఇటలీ

Also Read: Iran Vs Pakistan : పాక్‌పైనా ఇరాన్ ఎటాక్.. మిస్సైల్స్, సూసైడ్ డ్రోన్స్‌తో ఉగ్ర స్థావరాలపై దాడి

ప్రపంచంలో బలహీనమైన మిలటరీలు ఇవే.. 

  1. భూటాన్
  2. మోల్డోవా
  3. సురినామ్
  4. సోమాలియా
  5. బెనిన్
  6. లైబీరియా
  7. బెలిజ్
  8. సియర్రా లియోన్
  9. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
  10. ఐస్లాండ్

శభాష్ ఇండియన్ ఆర్మీ

హిమాలయ శిఖరాలపై నిర్మించిన.. చైనా సరిహద్దుకు వెళ్లే రహదారులు చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ పక్కనే ఉన్న చైనా సరిహద్దులో భారత సైనికులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం లేకపోవడం. చైనా సరిహద్దుకు ఆహార పదార్థాలను డెలివరీ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, డబ్బాల్లో ఉన్న వస్తువులను మాత్రమే వారికి పంపిణీ చేసేవారు. వాటిని తినడం వల్ల సైనికుల ఆరోగ్యం చాలా చెడిపోయింది. చైనా సరిహద్దుకు ఆహార పదార్థాలను డెలివరీ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, డబ్బాల్లో ఉన్న వస్తువులను మాత్రమే వారికి పంపిణీ చేసేవారు. వాటిని తినడం వల్ల సైనికుల ఆరోగ్యం చాలా చెడిపోయింది.గ్రీన్‌హౌస్‌ను నిర్మించిన తర్వాత సైనికులకు కూరగాయలు పండించడంలో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ సైనికులు తినడానికి, తాగడానికి వారి స్వంత కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. యువత ఈ పండ్లు, కూరగాయలను స్వయంగా పండిస్తారు. తరువాత వాటిని వినియోగిస్తారు.