Site icon HashtagU Telugu

2 Women Stripped : పశ్చిమ బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన..

2 Women Beaten Bengal

2 Women Beaten Bengal

మణిపూర్ (Manipur Incident) ఈ పేరు గత కొద్దీ రోజులుగా దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. రెండు నెలలుగా అక్కడ మెయితెయ్, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయం భయం గా బ్రతుకుతున్నారు. ప్రతి రోజు ఎక్కడో చోట అల్లర్లు , హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ ఘటనల వల్ల దాదాపు 130 మంది చనిపోయారు. మే 4వ తేదీన తౌబాల్ జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వెలుగులోకి వచ్చి సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.

ఈ ఘటన ఫై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళన నడుస్తుండగా..తాజాగా పశ్చిమ బెంగాల్‌ (MANIPUR OR WEST BENGAL )లోనూ అలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు మహిళలను చావబాది అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన మల్దాలోని పకౌహట్‌లో జరిగింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో ఇద్దరు మహిళలను పట్టుకున్న స్థానికులు వారిని ఈడ్చిపడేసి దాడిచేశారు. వారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. దీనిపై బెంగాల్ బీజేపీ సెంట్రల్ కో-ఇంఛార్జి అమిత్ మాల్వియా ట్వీట్ చేసి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వీడియోను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.