Tech Companies: వామ్మో ఐటీ.. 2023లో 2 లక్షల ఉద్యోగాలు ఔట్!

మే 18 నాటికి దాదాపు రెండు లక్షల మంది టెక్కీలు (1,97,985) ఉద్యోగాలు కోల్పోయారు.

  • Written By:
  • Updated On - May 23, 2023 / 12:17 PM IST

ఆర్థిక అనిశ్చితి, ఇతర కారణాలో తెలియదు కానీ దేశంలోని పేరొందిన కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గుగూల్, అమెజాన్, స్విగ్గీ లాంటి కంపెనీలు సైతం నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో ఆయా కంపెనీలు ఉద్యోగులను తొలగించేకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. లేఆఫ్ ఎఫెక్ట్ ముఖ్యంగా ఐటీ రంగంపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. లేఆఫ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ layoff.fyi ప్రకారం 696 టెక్ కంపెనీలు ఈ సంవత్సరం ఉద్యోగులను తొలగించాయి.

ఫలితంగా, మే 18 నాటికి దాదాపు రెండు లక్షల మంది టెక్కీలు (1,97,985) ఉద్యోగాలు కోల్పోయారు, అయితే ఈ సంవత్సరం మరింత మంది ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది దాదాపు 1.64 లక్షల మంది కార్మికులపై ప్రభావం పడింది. ఇక ఉద్యోగులను తొలగించిన అగ్రశ్రేణి కంపెనీలలో మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఉన్నాయి. ఉద్యోగులను భారీగా తొలగించిన మొదటి ప్రధాన టెక్ కంపెనీలలో ట్విట్టర్ ఒకటి. అక్టోబర్ చివరలో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత, ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులను తగ్గించింది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా తదుపరి నెలల్లో ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించాయి. అంటే దాదాపు ప్రతి నెలా ఉద్యోగుల తొలగింపునకు ప్లాన్ చేస్తున్నాయి.

భారతదేశంలో, అనేక టెక్ కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడానికి, నష్టాలను భర్తీ చేయడానికి కఠినమైన చర్యలకు పాల్పడుతున్నాయి.  భారతదేశంలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలున్న యాక్సెంచర్ వంటి కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా కార్మికులను తొలగించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భయంతో 19,000 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు యాక్సెంచర్ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ కారణంగా ఐటీ రంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మున్ముందు మరిన్ని కోతలు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు.

Also Read: Pragya Jaiswal: బోల్డ్ లుక్ లో బాలయ్య హీరోయిన్.. ప్రగ్యా అందాలకు అభిమానులు క్లీన్ బోల్డ్