KCR : బీఆర్‌ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం ఈ నెల 19న సమావేశం కావాలని.. అధినేత కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అధినేత ఆదేశాల మేరకు.. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం1 గంట నుంచి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనుంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ, ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు.. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు హాజరవుతారు.
Read Also: New Income Tax Bill : కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టిన సీతారామన్
ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సమావేశంలో చర్చిస్తాం అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ ఉంటుంది.
అధికారం కోల్పోయిన జరుగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై అందరి దృష్టి పడింది. కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారని.. కాంగ్రెస్ వైఫల్య పాలనపై పోరాడేందుకు కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని సన్నద్ధం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి చెందినా క్షేత్రస్థాయిలో బలంగా ఉండడం.. స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పార్టీని బలోపేతం చేసే యోచనలో గులాబీ అధినేత ఉన్నారు. ఈ సమావేశంతో కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించ అవకాశం ఉంది.
Read Also: Bank Holiday: బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఆరోజు సెలవు రద్దు!