Site icon HashtagU Telugu

18th Century Lemon : మురిగిపోయిన నిమ్మకాయ.. లక్షన్నరకు వేలం.. ఎందుకు ?

18th Century Lemon

18th Century Lemon

18th Century Lemon : అసలు కంటే కొసరుకే ఎక్కువ రేటు దక్కింది. ఓ డెస్కును వేలం వేయడానికి తీసుకెళ్తే..  ఆ డెస్కు కంటే దానిలోని సొరగులో దొరికిన నిమ్మకాయకే ఎక్కువ రేటు వచ్చింది. డెస్కుకు కేవలం రూ.3,200 రాగా.. అందులో దొరికిన పాత నిమ్మకాయకు లక్షన్నర రూపాయలు వచ్చాయి. ఇంతకీ ఆ నిమ్మకాయ స్పెషాలిటీ ఏమిటి ? ఎందుకా రేటు వచ్చింది ? ఆ నిమ్మకాయకు ఇండియాతో లింకు ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

ఇంగ్లండ్‌‌‌లోని ఓ కుటుంబానికి పూర్వీకుల నుంచి వారసత్వంగా కొంత ఫర్నీచర్‌ వచ్చింది. దాన్ని ఆ కుటుంబం వందల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తోంది. కారణం ఏమిటో తెలియదు కానీ.. తాజాగా ఆ కుటుంబం తమ పూర్వీకులకు చెందిన ఒక డెస్కును వేలం వేయాలని డిసైడైంది. ఇందుకోసం ఆ డెస్కును ష్రాప్‌షైర్‌లోని బ్రెట్టెల్స్ వేలం సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లింది.  ఏదైనా వస్తువును వేలం వేసే ముందు దానికి సంబంధించిన వీడియో గ్రఫీ చేసి.. పూర్తి వివరాలతో కూడిన వీడియో క్లిప్‌ను వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ వీడియోలు, ఫొటోల ఆధారంగా ఆసక్తి కలిగిన వారు దాన్ని కొనేందుకు ధరను కోట్ చేస్తారు. ఈక్రమంలోనే ఆ ప్రాచీన డెస్కును వీడియో షూట్ చేస్తుండగా.. అందులోని ఒక డ్రాఅర్‌ను తెరిచారు. తెరవగానే అందులో ఒక పాత నిమ్మకాయ కనిపించింది.

ఆ నిమ్మకాయపై ఇంగ్లిష్‌లో ఒక మెసేజ్ కూడా రాసి ఉంది. దాని ప్రకారం..  ఆ నిమ్మకాయం 1739 సంవత్సరం నాటిది. అంటే ఇప్పటి నుంచి 300 ఏళ్ల క్రితం ఈ నిమ్మకాయను(18th Century Lemon) .. ఒక మెసేజ్‌తో రాసి ఆ డ్రాఅర్‌లో దాచారన్న మాట.  ఈ నిమ్మకాయపై ఉన్న రైటింగ్ బహుశా తమకు మేనమామ వరుసయ్యే వ్యక్తిది అయి ఉండొచ్చని ఫర్నీచర్‌ను విక్రయానికి తెచ్చినవారు అంచనా వేశారు. 1739 టైంలో జీవించిన తమ కుటుంబీకుల వివరాలను వారు ఈసందర్భంగా నెమరువేసుకున్నారు.  చాలా సంవత్సరాలు మూసివేసి.. డెస్క్ డ్రాఅర్ లోపల ఉంచడంతో 2 అంగుళాల వెడల్పున్న ఆ నిమ్మకాయ రంగు పాలిపోయి గోధుమ కలర్‌లోకి మారిపోయింది. పూర్తిగా మురిగిపోయిన దానిలా తయారైన ఆ నిమ్మకాయను కూడా అనంతరం వేలానికి పెట్టారు. దీంతో ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తి లక్షన్నర రూపాయలు ఇచ్చిన ఆ పాత నిమ్మకాయను దక్కించుకున్నాడు.

Also Read : Door To Door Survey : అభయహస్తం అప్లికేషన్లపై డోర్ టు డోర్ సర్వే.. ఇవి రెడీ చేసుకోండి

బ్రెట్టెల్స్ వేలం సంస్థ యజమాని డేవిడ్ బ్రెట్టెల్ మాట్లాడుతూ.. ‘‘ఈ నిమ్మకాయకు బహుశా ఇండియాతో లింక్ ఉండి ఉండొచ్చు. ఇండియాలో నిమ్మకాయలను వివిధ శుభకార్యాలు, ఇతర పవిత్ర కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. బహుశా అదే కోణంలో దీన్ని దాచి ఉండొచ్చు. ఈ నిమ్మకాయ దాచిన వ్యక్తికి భారత సంప్రదాయాలు, జీవన విధానంపై ఆనాటికే అవగాహన ఉండి ఉండొచ్చు’’ అని అంచనా వేశారు.  17వ శతాబ్దంలో భారత్‌లో పనిచేసిన ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసి.. ఇంగ్లండ్‌కు తిరిగొచ్చిన వారికే ఈ తరహా అంశాలపై అవగాహన ఉంటుందని డేవిడ్ బ్రెట్టెల్ తెలిపారు.