Site icon HashtagU Telugu

“నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు”.. ఇజ్రాయెల్ లో 1800 ఏళ్ల కిందటి సమాధి రహస్యం!

Israel Samadhi

Israel Samadhi

“నన్ను ముట్టుకుంటే మ‌సైపోతారు” అని చెప్పే వాళ్ళను చూశాం!! కానీ “నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు” అని చెప్పేవాళ్ళు ఎక్కడా కనిపించరు!! కానీ ఈ విధంగా హెచ్చరిక రాసి ఉన్న శిలా ఫలకాన్ని ఇజ్రాయెల్ లోని కిర్యట్ టైవన్ పట్టణంలోని ఒక పురాతన సమాధిపై గుర్తించారు. అది 1800 ఏళ్ల కిందటిదని అంచనా వేస్తున్నారు. అప్పట్లో యూదు మతంలోకి మారిన జాకబ్ అనే వ్యక్తి తన సమాధిపై ఈమేరకు రాసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. 60 ఏళ్ల వయసులో అతడు చనిపోయి ఉంటాడని అంచనా వేస్తున్నారు. బహుశా.. చనిపోవడానికి ముందే శిలా ఫలకంపై “నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు” అని జాకబ్ రాసుకొని ఉండొచ్చని పురాతత్వ వేత్తలు భావిస్తున్నారు. జాకబ్ చివరి కోరిక మేరకు.. స్వ దస్తూరితో రాసుకున్న ఈ శిలా ఫలకాన్ని అతడి సమాధిపై అమర్చి ఉండొచ్చని అంటున్నారు. హైఫా విశ్వ విద్యాలయం, ఇజ్రాయెల్ యాంటి క్విటీస్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈవివరాలు వెలుగు చూశాయి.