1646 Jobs : పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం. ఆర్ఆర్సీ నార్త్ వెస్ట్రన్ రైల్వే 1646 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో అత్యధికంగా 488 పోస్టులు జైపూర్ రైల్వే డివిజన్ పరిధిలోని డీఆర్ఎం ఆఫీస్‌లో ఉన్నాయి. 424 పోస్టులు బికనీర్ డివిజన్‌లోని డీఆర్ఎం ఆఫీస్‌లో ఉన్నాయి. 402 పోస్టులు అజ్మేర్ డివిజన్‌లోని డీఆర్ఎం ఆఫీస్‌లో ఉన్నాయి. 113 పోస్టులు అజ్మేర్ డివిజన్‌లోని బీటీసీ క్యారేజ్ పరిధిలో ఉన్నాయి. 67 పోస్టులు జోధ్‌పుర్ డివిజన్ పరిధిలోని డీఆర్ఎం ఆఫీస్‌లో, మరో 67 పోస్టులు జోధ్‌పుర్ డివిజన్ పరిధిలోని క్యారేజ్ వర్క్‌షాప్‌లో ఉన్నాయి. అజ్మేర్ పరిధిలోని బీటీసీ లోకోలో 56 పోస్టులు, బికనీర్ పరిధిలోని క్యారేజ్ వర్క్‌షాప్‌లో 29 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ఫిట్టర్, పెయింటర్, మాసన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులు(1646 Jobs) ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. కొన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పదో తరగతిలో, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఆయా అప్రెం టిస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 10. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://rrcjaipur.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు. దరఖాస్తు రుసుమును కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
Also Read: YS Jagan Vs YS Saubhagyamma : వైఎస్ జగన్‌పై వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ ?
ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 6 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, శారీరక దార్ఢ్యం, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు దీనికి అర్హులు. 21 నుంచి 35 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. నెలవారీ పే స్కేల్ రూ.20,600 నుంచి రూ.63,660 వరకు ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులను కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 24. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు తగిన ఫార్మాట్‌లో దరఖాస్తు పత్రాలను నింపి అప్లై చేసుకోవచ్చు.