Nandigam Suresh Raymond: వైసీపీ నేత నందిగం సురేష్ కు కష్టాలు తప్పడం లేదు. నందిగం సురేష్ ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో సోమవారం ఆయనను పోలీసులు ప్రవేశపెట్టారు. గతంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ కావడం తెలిసిందే. మాజీ ఎంపీ గుంటూరులో జైలులో ఉన్నారు. నందిగం సురేష్ కు ఏపీ హైకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ పూచీకత్తూ సమర్పించని కారణంగా వైసీపీ నేత ఇంకా జైలులోనే ఉన్నారు.
Read Also: KTR vs Revanth : కేటీఆర్.. రేవంత్ ను భలే సామెతతో పోల్చడే..!!
మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది. వెలగపూడిలో 2020లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా.. ఆ వివాదంలో మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేరును సైతం ఈ కేసులో చేర్చడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన పలు ఘర్షణలు, వివాదాలు, దాడులపై కేసుల విచారణ కొనసాగుతోంది.
కాగా, వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. మంగళగిరి న్యాయస్థానం పీటీ వారెంట్ కు అనుమతించడంతో తుళ్లూరు పోలీసులు ఇవాళ నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించారు. మంగళగిరి న్యాయస్థానంలో నందిగం సురేష్ ను ప్రవేశ పెట్టారు. తాజాగా న్యాయస్థానం ఈనెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది.