Currency Note Press :  ఐటీఐ పాసయ్యారా ? కరెన్సీ నోట్ ప్రెస్‌లో జాబ్స్

Currency Note Press :  ఐటీఐ పాసయ్యారా ? ఫైన్​ ఆర్ట్స్​/ విజువల్​ ఆర్ట్స్​ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేశారా ?

  • Written By:
  • Updated On - October 24, 2023 / 11:40 AM IST

Currency Note Press :  ఐటీఐ పాసయ్యారా ? ఫైన్​ ఆర్ట్స్​/ విజువల్​ ఆర్ట్స్​ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేశారా ? గ్రాఫిక్స్​లో వొకేషనల్​ డిగ్రీ ఉందా ? అయితే మంచి ఉద్యోగ అవకాశం ఇది. మహారాష్ట్రలోని నాసిక్​లో ఉన్న కరెన్సీ నోట్ ప్రెస్​ (సీఎన్పీ)లో 117 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా 112 జూనియర్ టెక్నీషియన్, 2 సూపర్​వైజర్​ (టీఓ ప్రింటింగ్​), 1 సూపర్​వైజర్​ (అఫీషియల్ లాంగ్వేజ్​), 1 ఆర్టిస్ట్​ (గ్రాఫిక్ డిజైనర్​), 1 సెక్రటేరియల్​​ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఐటీఐ పాస్ అయినవారు  జూనియర్ టెక్నీషియన్​ పోస్టులకు అర్హులు. అయితే ఐటీఐలోని ఎలక్ట్రికల్​/ మెషినిస్ట్​/ ఫిట్టర్​/ ఎలక్ట్రానిక్స్​/ ఎయిర్​ కండిషనింగ్​/ ప్రింటింగ్​ ట్రేడ్ విభాగాల్లో క్వాలిఫై అయి ఉండాలి. ఆర్టిస్ట్ పోస్టులకు ఫైన్​ ఆర్ట్స్​/ విజువల్​ ఆర్ట్స్​ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. గ్రాఫిక్స్​లో వొకేషనల్​ డిగ్రీ చేసిన వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. సూపర్​వైజర్​ పోస్టులకు అప్లై చేసేవారి వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. ఆర్టిస్ట్​, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి.టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసేవారి వయస్సు 25 ఏళ్లలోపు(Currency Note Press)ఉండాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఆసక్తి గల అభ్యర్థులు https://cnpnashik.spmcil.com/en/  అనే వెబ్‌సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబరు 18. అభ్యర్థులకు ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారిని జాబ్‌కు ఎంపిక చేస్తారు. అయితే సెక్రటేరియల్​ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసిన వారికి స్టెనోగ్రఫీ/టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. సూపర్​వైజర్లకు నెలకు రూ.27,600 నుంచి రూ.95,910 వరకు, ఆర్టిస్ట్, సెక్రటేరియల్​ అసిస్టెంట్లకు నెలకు రూ.23,910 నుంచి 65,570 వరకు, జూనియర్ టెక్నీషియన్లకు నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 వరకు జీతం ఉంటుంది.

Also Read: MLC Kavitha: కవితకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం, తెలంగాణ స్థితిగతులపై కీలకోపన్యాసం