Site icon HashtagU Telugu

Vodafone Jobs: ఉద్యోగులకు వోడాఫోన్ షాక్.. 11 వేల మంది ఔట్!

Expected Jobs

Jobs employment

కరోనా తర్వాత కార్పోరేట్ కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. కంపెనీలకు గడ్డుకాలం ఎదురవుతుందనడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోడానికే ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ కంపెనీ 11వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించి షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్నవారిలో.. రాబోయే మూడేళ్లలో 11వేలమంది ఉద్యోగులను తొలగిస్తామని చెప్పింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా వోడాఫోన్ కంపెనీలో పనిచేసే వారిలో దాదాపు 10శాతం మంది బెంచ్ పై ఉన్నట్టే లెక్క. ఉద్యోగాల్లో భారీ కోత పెట్టబోతున్న వోడఫోన్ విస్తరణ ప్రణాళిక ఎలా రచిస్తుందో తేలాల్సి ఉంది.

కంపెనీని విస్తరిస్తున్నాం, మిగతా కంపెనీలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నామని ఎవరైనా చెబితే.. పెట్టుబడులు తెస్తారు, ఉద్యోగుల్ని పెంచుకుంటారని అనుకుంటాం. కానీ వోడాఫోన్ మాత్రం ఉద్యోగుల్ని తొలగిస్తూనే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందిస్తామంటోంది. సంస్కరణల అమలులో భాగంగా తొలగింపు తప్పదని తేల్చి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా వోడాఫోన్ కంపెనీలో లక్షమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 11వేల మందిని తొలగిస్తున్నారంటే 10శాతం కంటే ఎక్కువమందినే ఇంటికి పంపిస్తారనమాట.

Also Read: NIA: టెర్రరిస్టు, గ్యాంగ్‌స్టర్‌లపై ఎన్‌ఐఏ చర్యలు.. 100 చోట్ల దాడులు