జీవిత చరమాంకంలో ఎవరైనా ఏం చేస్తారు? నచ్చిన పనులు చేస్తారు.. లేదంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోతారు. కానీ 109 ఏళ్ల ఆల్ఫ్రెడ్ విశ్రాంత జీవనం గడపకుండా పర్యావరణానికి, పక్షులకు మేలు చేసే పనులు చేస్తున్నారు. ఆయన ఓసారి సరాదాగా గడిపేందుకు సాయంత్రం సమయంలో ఓ సముద తీర ప్రాంతానికి వెళ్లాడు.
అక్కడ రకరకాల పెంగ్విన్ పక్షులు కనువిందు చేశాయి. ఎంతోమంది పర్యాటకులు వాటిని వీక్షిస్తూ మైమరిపోతున్నారు. అయితే పెంగ్విన్ గుంపులో ఒకటి గాయపడి తీవ్ర రక్తస్రావం జరిగి ఆల్ఫ్రెడ్ కు కనిపించింది. దీంతో వెంటనే ఆయన ఆ పెంగ్విన్ ను చేతుల్లోకి తీసుకొని సపర్యలు చేశారు. కాటన్ తో ఆ దెబ్బలను తుడిచి, రక్షణ కల్పించాడు.
అయితే సముద్ర తీర ప్రాంతాల్లో విహరించే పెంగ్విన్ పక్షులెన్నో గాయపడుతున్నాయని తెలుసుకున్నాడు. దీనికి శాశ్వతమార్గం చూపాలనుకున్నాడు ఆల్ఫ్రెడ్. వాటికి సరిపోయే బట్టలను (స్వెట్టర్స్) కుట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఓ సూది, దారం తీసుకొని లేటు వయసులోనే వాటికి బట్టలు కుడుతున్నాడు. వాటికి కుట్టడమే కాకుండా స్వయంగా తొడుగుతూ సముద తీర ప్రాంతాల్లో విడిచిపెడుతున్నాడు. ఎప్పుడైనా అటువైపు ఆల్ఫ్రెడ్ వెళ్తే.. ఆయన కోసం పెంగ్విన్స్ అన్నీ క్యూ కడతాయి. ఆయన చేతి స్పర్శ కోసం తహతహలాడుతాయి. జీవిత చరమాంకంలోనూ పెంగ్విన్ సేవలో తరిస్తున్నాడు ఈ పెద్దాయన.