Site icon HashtagU Telugu

Supersonic Asteroid: బుల్లెట్ ట్రైన్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో భూమి వైపుకు ఆస్టరాయిడ్!!

Asteroid

Asteroid

బుల్లెట్ ట్రైన్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణించే ఒక ఆస్టరాయిడ్ ఇవాళ భూమికి చేరువగా రానుంది. దాని పేరు “2022 QC7”. దాదాపు 16 మీటర్ల నుంచి 36 మీటర్ల వెడల్పు సైజులో ఇది ఉంటుంది. 36 మీటర్లు అంటే.. బోయింగ్ 767 విమానం రెక్కలో సగం సైజు ఉంటుందన్న మాట. “2022 QC7” ఆస్టరాయిడ్గంటకు 32,760 కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఈ ఆస్టరాయిడ్ భూమికి 46 లక్షల కిలోమీటర్ల దూరం నుంచే తన కక్ష్యలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని, భూమిని తాకకపోవచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ అది భూమిని తాకినా పెద్దగా జరిగే నష్టం ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ఒకవేళ “2022 QC7” ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే ఏం జరుగుతుంది? అనే దానిపై శాస్త్రవేత్తలు లెక్కలు కడుతున్నారు. ఇజ్రాయెల్ లోని వైజ్ మన్ ఇన్స్టిట్యూట్ కు అనుబంధంగా పనిచేసే డేవిడ్ సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు నివ్వెర పరిచే విశ్లేషణ చేశారు. “2022 QC7” ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే.. భూమిపై మొదటి ఆటం బాంబు పడినప్పుడు విడుదలైన శక్తి కంటే వెయ్యిరెట్లు ఎక్కువ శక్తి రిలీజ్ అవుతుందని వారు వెల్లడించారు. 140 మీటర్ల డయామీటర్ కలిగిన ఈ ఆస్టరాయిడ్ భూమిని కుదిపేయగలదని పేర్కొన్నారు.

నాసా ఏం చెప్పింది ..

ఈ గ్రహశకలాల్ని గమనించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలో ప్రత్యేక విభాగం ఉంది. ఈ టీమ్.. భూమికి 75 లక్షల కిలోమీటర్ల లోపు తిరిగే గ్రహశకలాల్ని గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ఈ గ్రహశకలాల్లో 492 అడుగుల కంటే పెద్దగా ఉండే గ్రహశకలాలను అత్యంత ప్రమాదకరమైనవిగా నాసా గుర్తించింది. ఎందుకంటే ఇవి ఢీకొంటే.. నష్టం అంచనాలకు మించి ఉంటుంది.