Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.

Shock to BRS: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే. నేతలను కాపాడుకునే పనిలో పడ్డ బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తెలంగాణ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన అడిగిన టికెట్ ఇవ్వడానికి తెలంగాణ బీజేపీ నేతలు నో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ బీబీ పాటిల్ అభ్యర్థనకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆయన బీజేపీలో చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: KTR : సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌..!