Sharmila Arrested LIVE : పోలీస్ క్రేన్ తో ష‌ర్మిల ఉన్న కారు ఈడ్చివేత‌.!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల ప‌ట్ల తెలంగాణ పోలీస్ వ్య‌వ‌హ‌రించిన తీరు విచిత్రంగా ఉంది. ఆమె కూర్చున్న కారును క్రేన్ తో తీసుకెళ్లిన దృశ్యాలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 03:09 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల ప‌ట్ల తెలంగాణ పోలీస్ వ్య‌వ‌హ‌రించిన తీరు విచిత్రంగా ఉంది. ఆమె కూర్చున్న కారును క్రేన్ తో తీసుకెళ్లిన దృశ్యాలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరెస్ట్ ను నిర‌సిస్తూ పార్టీ క్యాడ‌ర్ తో పాటు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వైపు వెళ్ల‌డానికి ఆమె కారు కూర్చున్నారు. అప్ర‌మ‌త్తం అయిన పోలీసులు క్రేన్‌ను తీసుకొచ్చి కారును నగర వీధుల గుండా లాక్కెళ్ల‌డం గ‌మ‌నార్హం. క్రేన్ లాగుతోన్న కారులో ఆమె కూర్చున్న దృశ్యాల కోసం మీడియా ప్రతినిధులు ఎగ‌బ‌డ్డారు. వీడియోల్లో సోమ‌వారం ఘర్షణలో దెబ్బతిన్న విండో అద్దాలు ఉన్న వాహనంగా క‌నిపిస్తోంది.

వరంగల్ జిల్లాలో ష‌ర్మిల పాద‌యాత్ర కొన‌సాగుతోన్న స‌మ‌యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఆమె మద్దతుదారుల మధ్య ఘర్షణ నెల‌కొంది. దీంతో ఆమెను వరంగల్ చెన్నారావుపేట బ్లాక్ పరిధిలోని లింగగిరి గ్రామంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమె కాన్వాయ్‌పై దాడి చేశారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆయ‌న‌పై ఆరోపించారు. “అతని భార్య కూడా సాక్షాత్తు ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ భూకబ్జాలకు పాల్పడుతోంద‌ని ష‌ర్మిల తీవ్ర ఆరోప‌ణ‌లకు దిగారు.

సోమవారం మధ్యాహ్నం షర్మిల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ష‌ర్మిల బస్సుకు నిప్పుపెట్టారు. కొందరు వైఎస్ఆర్టీపీ నేతల కార్లను కూడా ధ్వంసం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిని వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. తెలంగాణ ప్ర‌భుత్వం, పోలీసుల తీరును నిర‌సిస్తూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి వైఎస్సాఆర్ టీపీ ప్ర‌య‌త్నం చేసింది. ఆ సంద‌ర్భంగా ష‌ర్మిల కారులో కూర్చుని ఉండ‌గా ఆ కారును పోలీసులు క్రేన్ తో తీసుకెళ్ల‌డం హైలెట్ గా నిలిచింది.