వైఎస్ త‌ర‌హాలో ష‌ర్మిల పాద‌యాత్ర‌.. చేవెళ్ల నుంచి అక్టోబ‌ర్ 20న శ్రీకారం

రాజ‌న్న రాజ్యం కోసం ష‌ర్మిల పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అక్టోబ‌ర్ 20వ తేదీ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. చేవెళ్ల నుంచి ప్రారంభించి మ‌ళ్లీ అక్క‌డే పాద‌యాత్ర‌ను ముగించేలా బ్లూ ప్రింట్ ను రూప‌క‌ల్ప‌న చేశారు.

  • Written By:
  • Publish Date - September 21, 2021 / 03:31 PM IST

రాజ‌న్న రాజ్యం కోసం ష‌ర్మిల పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అక్టోబ‌ర్ 20వ తేదీ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. చేవెళ్ల నుంచి ప్రారంభించి మ‌ళ్లీ అక్క‌డే పాద‌యాత్ర‌ను ముగించేలా బ్లూ ప్రింట్ ను రూప‌క‌ల్ప‌న చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేయ‌డం ద్వారా దివంగ‌త వైఎస్ రాజ‌కీయ వార‌సురాలిగా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఆయ‌న అమ‌లు చేసిన ప‌థ‌కాల అమ‌లు, తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌పై పోరాటాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ల‌డానికి పాద‌యాత్రను అస్త్రంగా ఎంచుకున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 2004 ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ పాద‌యాత్ర చేశాడు. అనూహ్య‌మైన మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక 2018 వ‌ర‌కు ఏపీలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు పాద‌యాత్ర చేసి 2014లో అధికారంలోకి రాగ‌లిగారు. పాద‌యాత్ర చ‌రిత్ర‌ను తీసుకుంటే ఎవ‌రైతే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు పాద‌యాత్ర చేస్తారో..వాళ్లు అధికారాన్ని పొందారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌వ్యాప్తంగా పాద‌యాత్ర చేయ‌డానికి ష‌ర్మిల సిద్ధం అయ్యారు.

వైఎస్ ఆనాడు చేవెళ్ల నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించాడు. ఇచ్చాపురం వ‌ర‌కు సుదీర్ఘ పాద‌యాత్ర చేసి చ‌రిత్ర‌ను లిఖించాడు. ఇప్పుడు అదే పంథాలో చేవెళ్ల నుంచి పాద‌యాత్ర‌ను ష‌ర్మిల ప్రారంభించ‌డానికి సిద్ధం అయ్యారు. చేవెళ్ల సెంటిమెంట్ తో పాటు రాజ‌న్న రాజ్యానికి అక్క‌డి నుంచి నినాదం వినిపించాల‌ని త‌ల‌పెట్టారు. తెలంగాణ వైఎస్ ఆర్టీపీ మూల సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా వెళ్ల‌డానికి ఈ పాద‌యాత్ర ఉప‌యోప‌డ‌నుంది. సంక్షేమం, స‌మాన‌త్వం, స్వ‌యంస‌మృద్ధి మూల సిద్ధాంతాలుగా ప్ర‌జ‌ల్లోకి వైఎస్ఆర్టీపీ వ‌చ్చింది. ఆ నినాదాన్ని పాద‌యాత్ర‌లో వినిపిస్తూ ..ఉచిత విద్య‌, వైద్యం..50శాతం మహిళ‌ల‌కు అభ్య‌ర్థిత్వాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న టిక్కెట్ల‌ను కేటాయించేలా ష‌ర్మిల ముందుకు వెళుతున్నారు.
బ‌ల‌మైన పార్టీలు తెలంగాణ‌లో ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఎదుర్కోవ‌డానికి పాద‌యాత్ర మార్గ‌మ‌ని ష‌ర్మిల భావిస్తున్నారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ తో అధికారంలోకి వ‌చ్చింది. ఈసారి ఎలాగైన సెంటిమెంట్ ప‌నిచేయ‌ద‌ని ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ తో పాటు తీర్మాన్ మ‌ల్ల‌న్న‌, బీఎ స్పీ ద్వారా ప్ర‌వీణ్ కుమార్ రాజ్యాధికారం కోసం పోటీ ప‌డుతున్నారు. వీళ్ల‌కు పోటీగా రాజ‌న్న రాజ్యంనినాదంతో ష‌ర్మిల పాద‌యాత్ర‌కు దిగుతున్నారు. ఆ యాత్ర ద్వారా ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి అన్ని మార్గాల‌ను స‌మ‌కూర్చుకుంటున్నారు. చివ‌ర‌కు తెలంగాణ ప‌బ్లిక్ ఎలాంటి తీర్పు ష‌ర్మ‌ల‌కు ఇస్తారో వేచిచూడాల్సిందే.