Site icon HashtagU Telugu

YSR Stamp : స్టార్ క్యాంపెయిన‌ర్ ష‌ర్మిల‌? వాట్ నెక్ట్స్ రేవంత్ .!

YSR Stamp

Sharmila

తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయ (YSR Stamp) మ‌లుపు తిర‌గ‌నుంది. వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం త‌రువాత భారీ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ గా ష‌ర్మిల హ‌ల్ చ‌ల్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె 3,800 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర తెలంగాణ వ్యాప్తంగా చేశారు. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌రిష్మా (YSR Stamp) ఆమెకు పుష్క‌లంగా ఉంది. ఇందిర‌మ్మ రాజ్య‌మంటూ రేవంత్, రాజ‌న్న రాజ్య‌మంటూ ష‌ర్మిల ఇప్ప‌టి వ‌ర‌కు వేర్వేరుగా ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లారు. ఇక నుంచి సోనియ‌మ్మ రాజ్యం కోసం ఇద్ద‌రూ ప‌నిచేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం(YSR Stamp) 

క‌ర్ణాట‌క ఫ‌లితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వ‌చ్చిన త‌రువాత ప‌రిణామాలు చాలా వేగంగా తెలంగాణ‌లో మారిపోతున్నాయి. పైగా ఆ రాష్ట్రంలో గెలుపు కోసం కీ రోల్ పోషించిన డీకే శివ‌కుమార్ తెలంగాణ మీద దృష్టి పెట్టారు. అందుకే, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న సునీల్ క‌నుగోలు బ‌దులుగా సెంథిల్ రంగంలోకి దిగారు. ఆయ‌న సూచ‌న మేర‌కు ష‌ర్మిలను తెలంగాణ రాజ‌కీయ రంగంలోకి కాంగ్రెస్ దింపుతోంద‌ని స‌మాచారం. తెలంగాణ‌లో రాజ్యాధికారం, ఏపీలో ఉనికి కాపాడుకునేలా సెంథిల్ రూట్ మ్యాప్ త‌యారు చేశార‌ని వినికిడి. దాన్ని ష‌ర్మిల (YSR Stamp) రూపంలో అమ‌లు చేయడానికి ఆయ‌న సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లోని రేవంత్ వ‌ర్గానికి

గ‌త కొన్ని రోజులుగా వైఎస్పాఆర్ తెలంగాణ పార్టీ విలీనం ప్ర‌క్రియ‌కు సంబంధించిన టాక్స్ న‌డుస్తున్నాయి. అవి, చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ష‌ర్మిల‌తో పాటు బ్ర‌ద‌ర్ అనిల్ కూడా ఢిల్లీ వెళ్లారు. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్, సెంథిల్ కూడా వాళ్ల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గాంధీ కుటుంబంలోని రాహుల్, ప్రియాంక‌, సోనియాల‌ను క‌లిసిన త‌రువాత విలీనం పూర్తయ్యేందుకు అవ‌కాశం ఉంది. ఈ ప్ర‌క్రియ తెలంగాణ కాంగ్రెస్ లోని రేవంత్ వ‌ర్గానికి మింగుడుప‌డ‌డంలేదు. ఆమె కీల‌క రోల్ పోషిస్తే, రెడ్డి సామాజిక‌వ‌ర్గం అటు వైపు మ‌ళ్లుతుంద‌ని ఆయ‌న   వ‌ర్గీయుల ఆందోళ‌న‌.. పైగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని భావిస్తున్నారు. కేవ‌లం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో అంద‌రిలో ఒక‌డిగా మార్చ‌డానికి మాత్ర‌మే ష‌ర్మిల‌ను రంగంలోకి సీనియ‌ర్లు (YSR Stamp) దించార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : YS Sharmila: తెలంగాణ గ‌డ్డ‌పైనే ష‌ర్మిల రాజ‌కీయం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ఆర్‌ బిడ్డ‌!

వాస్త‌వంగా సోనియా కుటుంబంతో విభేదించిన త‌రువాత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. ఆ పార్టీ కార‌ణంగా ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయింది. ఆ రోజు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓదార్పు యాత్ర‌కు విభేదించిన సోనియాకు వ్య‌తిరేకంగా వైఎస్ ఫ్యామిలీ పార్టీ పెట్టింది. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపించిందని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. ఆ ద‌శ‌లో ష‌ర్మిల ఉమ్మ‌డి రాష్ట్రంలో పాద‌యాత్ర చేయ‌డం ద్వారా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించారు. ఇరు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయంగా ఆమె సామాన్యుల‌కు కూడా సుప‌రిచ‌య‌మే. అంతేకాదు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన త‌రువాత తెలంగాణ వాదం బ‌ల‌హీన‌పడింది. ఆ క్ర‌మంలో ష‌ర్మిల‌ను రెండు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు వాడుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

Also Read : YS Sharmila: రాహుల్ కు అభినందనలు తెలిపిన వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి పాలేరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ష‌ర్మిల ఆశిస్తున్నారు. అక్క‌డ తొలి నుంచి ఆమె పోటీకి ఇంట్ర‌స్ట్ గా ఉన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు చాలా వ‌ర‌కు వైఎస్ అనుచ‌రులు. ఆ కార‌ణంగా ష‌ర్మిల అంటే సానుకూలంగా ఉంటార‌ని తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ అవస‌రాల దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించ‌డానికి కాంగ్రెస్ ఆమెను సిద్దం చేస్తోంది. ఇలా ప‌లు ప్ర‌తిపాద‌న‌ల న‌డుమ ఏకాభియానికి వ‌చ్చిన త‌రువాత సోనియా వ‌ద్ద విలీనం ప్ర‌క్రియ‌కు ముగింపు ప‌ల‌క‌నున్నారు. అందుకోసం శుక్ర‌వారం ముహూర్తంగా పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ష‌ర్మిల ఎంట్రీ ఉంటే త‌ప్పుకుంటాన‌ని ఒకానొక సంద‌ర్భంలో రేవంత్ వ్యాఖ్యానించార‌ని వినికిడి. పైగా ఆమె తెలంగాణ ఎంట్రీని వ్య‌తిరేకించిన తొలి కాంగ్రెస్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏ విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌.