YSR Birth Anniversary: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విజయవాడకు వెళ్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకలకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు కూడా హాజరవుతారు.
మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాల్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ అభిమానుల్ని ఏకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో వైఎస్ఆర్ అభిమానులను ఆకట్టుకునేలా కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
మరోవైపు తెలంగాణలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ప్రజాభవన్, గాంధీభవన్‌లో నిర్వహించేందుకు టీపీసీసీ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ప్రజాభవన్‌లో వైఎస్‌ఆర్ విజయాలను తెలియజేస్తూ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
Also Read: Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన యాత్రికులు