Site icon HashtagU Telugu

YS Viveka Murder Case : తెలంగాణకు వైఎస్ వివేకా హత్య కేసు..త్వరగా పూర్తిచేయాలని సుప్రీం ఆదేశం..!!

Viveka Murder

Viveka

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్నతీరుపై ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలో తమ న్యాయం జరగదని సునీతారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన ధర్మాసనం..ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించిది సుప్రీంకోర్టు. ఏపీ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.